మాధవా నీ భవ్య చరితము స్ఫూర్తి నిచ్చును మాకు నిరతము
నీదు పావన పాద స్పర్శతో పుడమి భారతి పులకరించెను
నీదు దీక్షా దక్షతలతో కీర్తి నొందెను సంఘ చరితము
అమరమైనది నీదు జన్మము అందుకొనుమా వందనములు
తల్లి భారతి వైభవముకై పరితపించి, పరిశ్రమించి
ధూమశకటమె నీదు గృహముగ మాతృభూమిని కలియ తిరిగిన
అలసటెరుగని నీదు పయనము స్ఫూర్తినిచ్చును మాకు నిరతము
మృదు మధురమౌ నీదు మాటల పాంచజన్యము పలకరించగ
శతృవును మిత్రునిగ మార్చెడు నీదు సౌమ్యత మాకు బలముగ
సంఘ గంగామృతము పంచగ దారి చూపిన దీపకళిక
పెను తుఫానుల కెదురు నిలిచి సంఘ నావను దరికి చేర్చి
నీదు శక్తితొ నీదు యుక్తితొ విస్తరించెను సంఘ కార్యము
మాతృదేవి పదార్చనముకై నీదు రక్తము నీరు చేసిన
చిరపురాతన నిత్య నూతన మాతృవైభవ గరిమ కొరకై
శాఖయే నా దైవమనుచు సంఘటనయే సాధనముగా
మాతృ అర్చనె నీదు వ్రతమై తల్లి భారతి తపము చేసిన
Powerd by VijayaVipanchi.org
0 comments:
Post a Comment