728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Saturday, 16 July 2011

చరితలోని సారమిదే భవితలోని భావమిదే - Vijaya Vipanchi




చరితలోని సారమిదే భవితలోని భావమిదే
వీర గాధ విజయ గాధలెన్ని విన్న మూలమిదే
వందే మాతరం వందే మాతరం
వందే మాతరం అంటోంది మా తరం


అరవింద వివేకానంద రామకృష్ణ దయానంద
సమర్ధుల సందేశం వందే మాతరం
ఛత్రపతి నేతాజీ సావర్కర్ తానాజీ
రాణా రక్తపు శౌర్యం వందే మాతరం
ఘాన్సి రాణి రుద్రమాంబ కత్తుల కథలే  || వందే మాతరం ||

మనలోని అనైక్యత సంస్కార విహీనత
ఆసరాగా అధికారం అందుకోనిరిరా
విద్వేషం రగిలించి విభజించి పాలించి
విద్రోహం తలపెట్టె ఫిరంగి ముకరా
బ్రిటిషు తంత్రాలకు విరుగుడు మంత్రం || వందే మాతరం ||

పొరుగువారి చొరబాట్లు మన తమ్ముల అగచాట్లు
దోపిడీలు హింసలకే అంతం లేదా
మతవాదులు ఉన్మాదులు  మారని పెడ ధోరణీలు
దానవత్వ పోకడ ప్రమాదమే కాదా
సమస్యలెన్ని వున్నా గాని సాధనమోకటే || వందే మాతరం ||

ఎన్నాళ్ళి వేదనా ఎన్నాళ్ళి రోధనా
తల్లి బాధ తీర్చకుంటే తనయులమేనా
వీరవ్రత సారధివై విశ్వ శాంతి వారధివై
విద్రోహుల గుండె చీల్చు చండ్ర పిడుగువై
విజయ శంఖమెత్తి పాడు భున భోంతరం || వందే మాతరం ||


Powerd by VijayaVipanchi.org
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: చరితలోని సారమిదే భవితలోని భావమిదే - Vijaya Vipanchi Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh