పాడరా ఎలుగెత్తి భవ్య భారతి గీతి
చాటరా చెయ్యెత్తి జాతి వైభవ కీర్తి
చూడరా కనులెత్తి జనని సుందరమూర్తి
ఆడరా శివమెత్తి అరి భయంకర దీప్తి
బంగారు పండేటి భూమిరా మనది
రతనాలు వరలేటి రాజ్యమ్ము మనది
ప్రకృతి సౌందర్యమ్ము ప్రోవు ఈ నేలా
నకలోకముకన్న మిన్నరా చాలా || పాడరా ||
కమనీయ కావ్యాలు కవులల్లినారురా
రాలు కరుగగా గానమాలపించారురా
రాతినే నాతి యని భ్రమియింప చేశారు
నీతి పథమున మనుజ జాతి నడిపించారు || పాడరా ||
శ్రీరామచంద్రుడే మా ధర్మ ప్రభువని
శివాజీ మహారాజు స్ఫూర్తి ప్రదాతయని
ధీర కేశవ వాణి దివ్య మంత్రమ్ముగా
మరల హైందవ జాతి మహిని వేలుగొందునని || పాడరా ||
Powerd by Vijayavipanchi.org
0 comments:
Post a Comment