728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Monday, 18 July 2011

సంఘ రవికిరణాలు తరుణారుణాలు హిందూ ధర్మోద్ధరణ కై తోరణాలు - Vijaya Vipanchi




సంఘ రవికిరణాలు తరుణారుణాలు
హిందూ ధర్మోద్ధరణ కై తోరణాలు

కాలమేఘము క్రమ్ము కటిక చీకటి దాటి
చిరనిద్ర వదిలించి చైతన్యమును  పెంచి
హిందువుల హృదయాల హిమశిలలు కరిగించి
భరతభూమిని  దివ్య భావాలు పండించు   ||సంఘ||

కొండ కొనలెక్కినవి కోనలో దూకినవి
గుండె గుండెను జేరి గుబులు తీర్చినవి
ప్రజల హృదయాలలో ప్రేమభావము పంచి
నవభారతిని క్రొత్త వెలుగులను నింపినవి  ||సంఘ||

విశ్వ హిందుత్వమై విద్యామహత్వమై
కార్మికుల పిడికిళ్ళ కాంతులను నింపినవి
రైతు కండలలోన కవుల గుండెలలోన
ధర్మరక్షణ దీప్తి ధరను పెంచినవి ||సంఘ||

భ్రమలలో అజ్ఞాన తిమిరమ్ము హరియించి
త్రోవ దప్పిన ఎట్టి తోటి హిందువులకై
హృదయ కమలాలలో మమత మధువులు నింపి
స్వాగతమ్మును పల్కు స్వాభిమానపు రుచులు  ||సంఘ||


Powerd by Vijayavipanchi.org
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: సంఘ రవికిరణాలు తరుణారుణాలు హిందూ ధర్మోద్ధరణ కై తోరణాలు - Vijaya Vipanchi Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh