సాగవోయి సోదరా సమర శీల యోధుడా
ఆగని ఈ పయనంలో తుది విజయం మనదిరా
ఒకే జాతి ఒకే నీతి ఒకటే మన సంస్కృతి
ఒకే హిందు వాహినిలా ప్రవహించెను భారతి
ఈ ఝరిలో విషం కలుపు విద్రోహుల పీచమణచి
అభ్యుదయామృత ఫలములు అందరికి పంచుటకై
హిందూ సంస్కృతి గంగా ధారలలో జలకమాడి
తరతరాల వారసత్వ తిలకమ్మును నుదుట దాల్చి
చందమామ సొగసువంటి స్నేహం హృది విరియాలి
భరతమాత బిడ్దలమని నింగిదాక చాటాలి
కరం కరం కలిపి కదిలి క్రాంతివ్యూహమల్లాలి
కణం కణం కలిసి కలిపి గుణం విస్తరించాలి
శరవేగంతో ఉద్యమ స్ఫూర్తి సాగిపోవాలి
అఖండ భారత ధాత్రి పైన ధర్మ ధ్వజం ఎగరాలి
Powerd by Vijayavipanchi.org
0 comments:
Post a Comment