728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Tuesday, 10 December 2013

మైసూరు మహారాజు శ్రీకాంతదత్త నరసింహరాజ వడియార్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసిన RSS

మైసూరు / బెంగళూరు 10/12/2013 : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం మైసూరు రాజ వంశీయుడైన శ్రీ శ్రీకాంతదత్త నరసింహరాజ వడియార్ పరమపదించడం పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది , 1953 లో  జన్మించిన ఆయన తేది 10/12/2013 మంగళవారం నాడు తీవ్ర గుండె పోటుతో బాదపడుతూ బెంగళూరు లోని విక్రమ హాస్పిటల్ లో   తుది శ్వాస విడిచారు. 
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సహా సర్ కార్యవాహ శ్రీ దత్తాత్రేయ హోసబలె శ్రీకాంతదత్త నరసింహరాజ వడియార్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసారు , మహారాజ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. 
మాన్య శ్రీ భాగయ్య అఖిల భారతీయ భౌద్దిక్ ప్రాముఖ్ విశ్వ సంవాద కేంద్రం తో మాట్లాడుతూ " మహారాజు మృతి పట్ల వినమ్ర శ్రద్ధాంజలి ఘటిసున్నాను " అని అన్నారు .

శ్రీ శ్రీకాంతదత్త నరసింహరాజ వడియార్ గురించి కొంత : 

మహారాజ శ్రీ శ్రీకాంతదత్త నరసింహరాజ వడియార్ (1953 - 2013 ) శ్రీకాంత వడియార్ గా సుప్రసిద్ధుడు , 1399 - 1950 ల కాలంలో మైసూరును పరిపాలించిన వడియార్ రాజవంశానికి చెందిన చివరి రాజు శ్రీ జయచామరేంద్ర వడియార్ , మహారాణి త్రిపుర సుందరి అమ్మని అవురు ల ఏకైక సంతానం , 1974 లో రాజవంశాదిశులుగా ప్రకటించబడ్డారు.
శ్రీకాంతదత్త నరసింహరాజ వడియార్ మైసూరు పార్లమెంటు నియోజకవర్గం నుండి నాలుగు సార్లు ( రెండు సార్లు భారత జాతీయ కాంగ్రేసు తరపున తర్వాత భారతీయ జనతా పార్టీ తరపున) మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఎన్నికయ్యారు . ఆయన మహారాణి ప్రమోద దేవి అవురు ను పెళ్ళి చేసుకున్నారు దంపతులు ఇద్దరు కూడా పోస్ట్ గ్రాడ్యుఏసియన్ పట్టబద్రులు, ఆయన 2010 వరకు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం అధ్యక్షులు గా సేవలందించారు,. 
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: మైసూరు మహారాజు శ్రీకాంతదత్త నరసింహరాజ వడియార్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసిన RSS Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh