728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Saturday, 16 July 2011

వేదభూమిది ధర్మభూమిది కర్మభూమిరా సోదరా - Vijaya Vipanchi



వేదభూమిది ధర్మభూమిది కర్మభూమిరా సోదరా
ఇది వైరి శిరముల బంతులాడిన వీర విక్రమ సీమరా
ఇది వీర విక్రమ సీమరా


విశ్వ జేతను నేనేయనుచు విర్ర వీగిన అలెగ్జాండరు
మస్తకమ్మును వంచిన పురుషోత్తమ్ముని పుట్టిల్లురా
పురుషోత్తమ్ముని పుట్టిల్లురా || వేదభూమిది ||


ప్రాణ భిక్షను విస్మరించిన కృతఘ్నుండా ఘోరికే
ఘోరి కట్టిన పృద్వీ రాజు ఘనతకెక్కిన సీమరా
ఇది ఘనతకెక్కిన సీమరా || వేదభూమిది ||


కల్ల మాటలతోనే జాతిని కొల్లగొట్టిన తెల్ల వారికీ
బల్లెమై ఎదలోన దిగే మన వీర ఘాన్సి చూడరా
మన వీర ఘాన్సి చూడరా || వేదభూమిది ||


భగత్ సింగ్ ఆజాదు శేఖరు అల్లూరి కన్నె గంటి
వేల వీరుల ప్రాణ త్యాగము తెచ్చే స్వాతంత్ర్యమ్మురా
మనకిచ్చే సౌభాగ్యమ్మురా || వేదభూమిది ||

Powerd by Vijayavipanchi.org
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: వేదభూమిది ధర్మభూమిది కర్మభూమిరా సోదరా - Vijaya Vipanchi Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh