728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Monday, 18 July 2011

సాగరం పొంగుతున్నదీ హిందు సాగరముప్పొంగుతున్నదీ - Vijaya Vipanchi



సాగరం పొంగుతున్నదీ హిందు సాగరముప్పొంగుతున్నదీ
సాగవింక పరమతాల ఆగడాలు సాగవింక సామ్య వాద సంబరాలు
ఆగదింక సమైక్య జనతా శక్తి ప్రభంజనం


మత దురహంకార జ్వాల మత్తును వదిలించినాది
తనవారే దూరమైతే మనసే క్షోభించినాది
దాన కేంద్రాలనే పరదానవ క్రీడలు సాగగ
మానవత్వమే మరచిన మ్లేచ్చులు పైపైకిరాగ
దాగి ఉన్న దావాగ్ని ధరణి దూకినాది
జాగృతమై జాతి రణ ఘోష సల్పినాది


ఏకాత్మత యజ్ఞమ్ముల హిందూ సమ్మేళనాల
ఆత్మీయత ఎదల పొంగె అనురాగం హృదుల నిండె
హిందువులం మనమంటూ బంధువులం మనమంటూ
అందరమొకటేనంటూ అంతరాలు లేవంటూ
సంఘటనా శంఖ ధ్వని మింటికెగసినాది
సంఘ విద్రోహులకిక గుండె చెదరినాది


నలుదిక్కుల చైతన్యము జరుగుతోంది నేడు
భరతావని హిందుత్వపు పెనుతుఫాను నేడు
ఇల దేశాలన్నింటికి తలమానికమవ్వాలని
పరమోన్నత వైభవాన్ని భారతికందించాలని
ప్రబలమైన ఆకాంక్షతో ప్రజా రధం కదిలింది
ప్రపంచమే తలవగ్గే క్షణం సమీపించింది

Powerd by Vijayavipanchi.org
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: సాగరం పొంగుతున్నదీ హిందు సాగరముప్పొంగుతున్నదీ - Vijaya Vipanchi Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh