పల్లె పల్లెను లేపి గుండె గుండెను ఊపి
నిండు శక్తిని జూపి నింగి నేలను జూపి
దుంకు దుంకర దుంకు దుగ్గ దుంకిన దుంకు
కాశ్మీరం సూడరో కత మారిపాయెరా
అస్సామీ నాడురో నెత్తుటి మడుగాయెరా
కలిస్తాను మాటరో కడుపున సిచ్చాయెరా
ముడుసుకు కూర్చుంటె నువు ముక్కలౌను దేశంబు
రస్యాకు ఇక్కడ రంగమేర్పడ్డాది
సైనాకు ఇక్కడ సేతులేర్పడ్డాయి
మతరాజ్యాలిక్కడ మార్బలం పెంచెరా
తెలవక నువ్వుంటే దేశమంటుక పోతాదిరో
అంటరానితనముంటె అడుగంటి పోతమురో
కులభేదాలుంటేను బలహీనులమౌతమురో
విదేశీ మతశక్తులు ఉచ్చులేస్తున్నయిరో
బ్రమసి నువ్వుంటేను బ్రతుకే సెడిపోతదిరో
మన మాటే పలికితే మనకే సిగ్గేలరా
మన బాటే తొక్కితే మనకే ఎగ్గేలరా
మన తోటే మనమైతే మరి తగ్గేదేమిరా
స్వాభిమానముంటేనే స్వతంత్రమ్ము ఉంటదిరో
0 comments:
Post a Comment