పదండి భరత యువకులార పౌరుషంబు పొంగగా
పదం పాడి కదం త్రొక్కి కదలి ముందుకేగుదాం
కవోష్ణ రుధిర జ్వాలలనె ఈ కండలు బిగిపోవగా
సవాలు చేసి సాటివారలందు ప్రతిభ చాటుదాం
పవిత్ర జాతిగీతమాలకింప బయలుదేరుదాం
కరాళ ప్రళయ సమయ కాల కంఠు కంటి మంటలై
చరాచరాలు వెలుగు సెందగా పురోగమించుదాం
హరహర మహదేవ యంచు ఎలుగెత్తి దూకుదాం
నదీనదాలు శిలలు గిరులు మనలకెదురు నిలచినా
అదే పునీత భగవ ఛాయలందు పరుగులెత్తుదాం
ముదమ్ము మీర మాతృ సేవ సేయ ముందుకేగుదాం
Powerd by Vijayavipanchi.org
0 comments:
Post a Comment