పహరా హుషార్ పహరా హుషార్ పహరా హుషార్
నీవు లేచి ఉండాలిరా కాపు కాచి ఉండాలిరా
లోకమంత మత్తులోన మునిగి తేలుతోందిరా
దేశమంత నీపైనే ఆశ పెట్టుకుందిరా
తూరుపు వెలుతురుతో నిండేదాకా
భరతమాత కలలన్నీ పండేదాకా
కాశ్మీరం ఈశాన్యం చెదరిపోవుచున్నవి
కన్యాకుమారిలోన చిచ్చు రగులుతున్నది
ఈ స్థితి ఇంతటితో అంతం కాగా
భారతి భవితవ్యం బంగరు కాగా
స్వార్ధ బుధ్ధి రాజ్యమేల ప్రగతి శూన్యమాయెరా
అన్యాయం అక్రమాలు హద్దు మీరిపోయెరా
నీతికి నియమానికి నేతవు నీవై
జాతికి నవశక్తి దాతవు కాగా
Powerd by Vijayavipanchi.org
0 comments:
Post a Comment