ఓ నర్మద బాణం ఓ సాలగ్రామం
ఓ వంశీ రాగం అదే సంఘ యోగం
వ్యక్తి వ్యక్తి కలియుటే సంఘ శక్తి తెలియుటే
సంస్కారం బడయుటే అదే సంఘ యోగం
అడవిలోన వెదురుకర్ర చెల్లచెదురే
ఆ వెదురే వేణువైతే మధుర స్వరాలే
గంగ ప్రవాహంగ కదల శిల శివలింగమే కాదా
నిత్య సాధనా స్థలం నీతిమతులకాలయం
మట్టినుండి మహదేవుల సృష్టించిన శాతకర్ణి
మావళీల మాధవులుగ మార్చినట్టి శివప్రభువు
భిల్లులతో ఆడుకున్న రణ రాణాగాధలే
సంఘ శాఖ కాదర్శం సత్య మార్గ దర్శనం
ఉపేక్షను విరోధమును దాటిన దశ మనదిరా
అంతటా అనుకూలత అదే మనకు గెలుపురా
ఉదాసీన భావము దరిచేరగ రాదురా
కార్య సాధనకు మూలం సంఘ శాఖ పిలుపురా
సంఘం పెరిగింది నేడు సర్వవ్యాపి సర్వ స్పర్శి
తాటి తరువు ప్రగతి వలదు మఱ్ఱి నీడ మనకు తోడు
ప్రతిష్ఠతో పనిలేదు పరివర్తన మన లక్ష్యం
మాతృభూమి వైభవమే మన శ్రమకు తగ్గ ఫలం
0 comments:
Post a Comment