శివుడే తానై శివుని కొలుచునటు రాష్ట్ర దేవతారాధనము
క్షణికమైన మన వ్యక్తి జీవనము అమరమొనర్చెడి సాధనము
పూచిన పూవుగ తనువును పెంచి స్నేహగంధమును జనులకు పంచి
వ్యక్తి పూర్తిగా వికసించాలి సంఘశక్తిగా భాసించాలి
తను మన జీవన త్యాగరాగముల నిత్య సాధనల శృతి చేసి
రాష్ట్ర వీణలో తంత్రిగ తానై సమరస గీతం వినిపించాలి
మన మాటలలో మన చేతలలో మన ఎద మెదలే ప్రతి కదలికలో
మన సమాజ హితమే మన స్వార్ధం మన గురుపూజకు ఇది పరమార్ధం
Powerd by VijayaVipanchi.org
0 comments:
Post a Comment