728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Monday, 18 July 2011

రాముడేలిన రాజ్యమిదిరా రత్నరాసుల నిలయమిదిరా - Vijaya Vipanchi



రాముడేలిన రాజ్యమిదిరా రత్నరాసుల నిలయమిదిరా
ధర్మదేనువు పాదమూనిన కర్మభూమిర సోదరా ||2 || ||రాముడేలిన||


దేశభక్తియు రాజభక్తియు తేజరిల్లగ చాంద భట్టుడు
ప్రభుని గూడెను రిపుని జంపెను కార్యశూరుడు సోదరా ||2 || ||రాముడేలిన||


అడవులందున ఇడుములంబడి కుడువకూడే లేకయుండియు
విడువలేదు ప్రతాపసింహుడు పౌరుషమ్మును సోదరా ||2 || ||రాముడేలిన||


శీలమునకై ప్రాణమొడ్డెను మానవతులకు మార్గమయ్యేను
దేశచరితకు వన్నె తెచ్చెను రాణి పద్మిని సోదరా ||2 || ||రాముడేలిన||


నాతియోక్కతే నీతిమతియై కదన భూమిని కదను ద్రొక్కుచు
తెల్లవార్ల గుండె చీల్చెను తల్లి ఝాన్సీ సోదరా ||2 || ||రాముడేలిన||


గుహను దాగిన కొదమ సింగపు మదము నణంచగా మహిత హృదయుడు
విశ్వమత సభ నా వివేకుడు గెలిచె వాదము సోదరా ||2 || ||రాముడేలిన||


హైన్దవేయుల హృదయ సీమల సంఘ జ్యోతిని వేలుగజేసిన
పుణ్యకేశవ మార్గమిదిగో అనుసరింపర సోదరా ||2 || ||రాముడేలిన||

Powerd by Vijayavipanchi.org
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: రాముడేలిన రాజ్యమిదిరా రత్నరాసుల నిలయమిదిరా - Vijaya Vipanchi Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh