వందనమమ్మా - ఓ అంబ భారతాంబ నీకు వందనమమ్మా
ఈ మట్టిలో మా దేహము పుట్టినదని చెప్పినారు
ఈ మట్టిలో మా దేహము గిట్టుననుచు చెప్పినారు
పుట్టి పెరిగి తుట్టతుదకు గిట్టుదుమీ మట్టిలోన
గంగ యమున కృష్ణమ్మా సింధు తుంగభద్రమ్మా
జీవనదులనిచ్చినావు పాడిపంటలొసగినావు
ఈ జగాన సాటిలేని రత్న గర్భవమ్మ నీవు
రామకృష్ణ భగవానుల అరవిందుల కవిచంద్రుల
శూరవీర ధీరులను సాధు సంతు పుంగవులను
ప్రసాదించి లోకానికి వెలుగునిచ్చినావు తల్లి
కేశవ మాధవులు మమ్ము భుజము తట్టి లేపినారు
త్యాగధనులు మాన ధనులు దారి చూపుచున్నారు
హిందువులగు నీ బిడ్దల సంఘటనలో చేర్చుతాము
Powerd By Vijayavipanchi.org
0 comments:
Post a Comment