వాషింగ్టన్, జనవరి 5: స్వామి వివేకానంద హిందూ మతం పట్ల విదేశీయుల్లో చైతన్యం కలిగించిన వందేళ్ల తర్వాత అమెరికాలోని ఆయన అనుయాయులు ఇక్కడ ఆయన బోధనలను ప్రచారం చేయడానికి వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. స్వామి వివేకానంద 150వ జయంతిని పురస్కరించుకుని హిందూ స్వయం సేవక్ సంఘ్ వివిధ కార్యక్రమాలను ప్రకటించింది. జాతీయ స్థాయి పోటీలు, చిన్న పిల్లలకు స్వామి వివేకానంద, శ్రీకృష్ణుడి కథలపై ‘్ధర్మ బీ’ పోటీలు, యువతకు క్షేత్రస్థాయి పర్యటనలు, అడ్వెంచర్, సేవా కార్యక్రమాలు, యూనివర్సిటీలలో హిందూమతంపై ఉపన్యాసాలు వంటివి ఈ కార్యక్రమాల్లో ఉన్నాయి.
చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో వివేకానందుడు ప్రసంగించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది సెప్టెంబర్ 11న ధర్మ, యోగా ఉత్సవాలను నిర్వహించాలని కూడా HSS ఆలోచిస్తోంది.
చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో వివేకానందుడు ప్రసంగించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది సెప్టెంబర్ 11న ధర్మ, యోగా ఉత్సవాలను నిర్వహించాలని కూడా HSS ఆలోచిస్తోంది.
సౌజన్యం : ఆంధ్రభూమి దిన పత్రిక
0 comments:
Post a Comment