728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Friday, 11 January 2013

జాతిని మేల్కొల్పిన ధీరుడు - స్వామి వివేకానంద


ఆశలు, ఆశయాలు మొగ్గల్లా వికసించి, విజయాల పరిమళాలు వెదజల్లే యుక్త వయస్సులో ‘నిరాశ’ ఆవరిస్తే ఎంత కృంగిపోతామో కదా! అలాంటి కష్ట సమయాల్లో ఒక ‘చిన్నమాట’ ఎంత స్ఫూర్తి నిస్తుందో! దేదీప్యమైన పలుకులతో, ప్రపంచంలోని ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపిన ‘సింహ నినాదం’ భారతజాతి ఆదర్శాలైన ప్రేమ, సేవ, త్యాగాలను విశ్వవ్యాప్తం చేసిన ‘వివేకభేరి’ కొన్ని వేల ఏళ్లకు సరిపడా ఆదర్శాలను ప్రపంచానికి అందించిన ఆ అమృత వాక్కు.. నేడు ఆవిర్భవించిందని ఈ దేశ యువతీ యువకులు తెలుసుకోకపోవడం అవివేకం కదా!150 సంవత్సరాల క్రితం సంక్రాంతి పర్వదినాన ఈ సనాతన జాతికి సం ‘క్రాంతి’ని ప్రసాదించటానికి కలకత్తా నగరంలో జన్మించాడో ‘దార్శనికుడు’ నిద్రాణమై ఉన్న జాతిని క్రియాశీలత వైపు జాగృతం చేశాడు. ఆ తేజోమూర్తి ఆ విశ్వనాయకుడిని తలుసుకుంటే మనలో ఒక అద్వితీయమైన భావన కలుగుతుంది. ఆ యుగవూదష్ఠే ‘స్వామి వివేకానంద’ నాటి జాతిపిత మహాత్మాగాంధీ మొదలుకొని, నేటి అన్నాహజారే వరకు ఎందరో దేశ విదేశీయులకు మార్గనిర్దేశనం గావించిన నరేన్ (నరేంవూదనాథ్ దత్త) 1863 జనవరి 12న భువనేశ్వరీదేవి, విశ్వనాథ్ దత్త దంపతులకు జన్మించారు. బాల్యంలోనే ధైర్యం, పేదల పట్ల సానుభూతి, సాధువుల పట్ల ఆకర్షణ వంటి సద్గుణాలు సహజంగా అతడు పుణికి పుచ్చుకున్నారు. 


మల్ల యోధుని శరీరాకృతి, మృదు మధుర స్వరమూ, నిశితమైన మేథస్సు అతడి సొత్తు.. నరేంవూదుడు తనలోని విమర్శనాత్మక బుద్ధి, విలువలు, మతం పట్ల విశ్వాసం మధ్య అంతర్గతంగా జరుగుతున్న పరస్పర సంఘర్షణను సందిగ్ధావస్థను పోగొట్టుకోవడానికి ఎందరో ప్రముఖులను కలుసుకున్నారు. కానీ ఆశించిన ఫలితం ఎక్కడా లభించలేదు. 1881లో ప్రొఫెసర్ విలియమ్ హేస్టీ మాటల ప్రభావంతో నరేంవూదుడి సమీప బంధువైన రామచంద్ర దత్త ప్రొదల్బంతో ఒక మహోన్నత ఘట్టం ఆవిష్కృతమైంది. అదే రామకృష్ణ పరమహంస.. స్వామి వివేకానంద మధ్య జరిగిన గొప్ప చారివూతాత్మక సమావేశం. నరేంవూదునికున్న అన్ని సందేహలను రామకృష్ణ పరమహంస పటాపంచలు చేశారు. 

అంతర్జాతీయ వేదిక మీద అపూర్వ విజయం.. సుమారు మూడేళ్లు భారతదేశ పర్యటన చేసి, సమాజంలో నెలకొన్న విపత్కర పరిస్థితులను చూసి చలించిపోయాడు. నరేంవూదుడు. ఎలాగైనా భారత దేశాన్ని పునర్నిర్మించాలనే మహాసంకల్పంతో, విదేశాలకు మన విలువల్ని చాటి, అక్కడి సాంకేతిక విజ్ఞానాన్ని భారతదేశానికి తీసుకురావాలని నిశ్చయించుకున్నాడు. అనూహ్య పరిస్థితుల్లో 1893లో అమెరికాలోని చికాగో పట్టణంలో జరిగిన సర్వమత సమ్మేళనంలో స్వామిజీ పాల్గొని తన వాక్పటిమతో, ఆత్మీయమైన పదజాలంతో అత్యున్నతమైన భారతీయ భావాలతో ప్రపంచ మేధావుల్ని ఆశ్చర్యపోయేలా చేశారు. అది మొదలుకొని, విశ్వ కళ్యాణకారకమైన, సర్వజన శ్రేయోదాయకమైన అంశాలను ప్రపంచమంతా ప్రచారం చేశారు. ముఖ్యంగా భారతదేశంలోని మూఢ నమ్మకాలను, కుల తత్తాన్ని, అంటరానితనాన్ని నిర్మూలించేందుకు విశేషంగా కృషి చేశారు. 1897లో తన గురువు పేరుతో ‘రామకృష్ణ మిషన్’ను ఏర్పాటు చేశారు. తన ఆరోగ్యాన్ని సైతం పట్టించుకోకుండా‘మానవసేవే- మాధవ సేవ’ అని మహామంవూతాన్ని మానవాళికి అందించిన వివేకానంద అతి పిన్నవయస్సులోనే భగవంతున్ని చేరుకున్నారు.

ఎన్నో ప్రలోభాలు, నిరాశ నిస్పృహతో కొట్టుమిట్టాడుతున్న నేటి తరం యువత ‘మీరు దేన్నైనా సాధించగలరు. ఎవరి నుంచి ఏమి ఆశించవద్దు, స్వశక్తిపై నిలబడండి. స్వతంవూతులుకండి. ఓ సింహ సదృశులారా! ప్రయత్నంలో వెయ్యిసార్లు అపజయం ఎదురైనా పట్టుదల వదలక మరోమారు ప్రయత్నించండి! మొదట నీకు నువ్వు తెలియపరచుకో అనే సందేశాన్నిచ్చిన స్వామి వివేకానంద జీవితంలోని నిత్యనూతన ప్రబోదాల్ని కొంతైనా యధార్థంగా అర్థం చేసుకొని, ఆచరిస్తే.. నేటి సమాజంలోని అనేక అనాగరిక రుగ్మతలు సమూలంగా కూకటివేళ్ళతో సహా నశిస్తాయనటం అతిశయోక్తి కాదు. తరాలు మారివుండవచ్చు. కానీ స్వామిజీ సందేశం మాత్రం నిరంతరం స్ఫూర్తినిస్తూ.. యువతీ, యువకులకు మార్గదర్శకంగా నిలుస్తుందనటానికి నిదర్శనమే ‘ఉస్మానియా వైద్య విద్యార్థుల సంఘం’ రంగాడ్డి జిల్లా వికారాబాద్‌లోని ‘యజ్ఞ’ (యూత్ ఆవేకింగ్ ఫర్ గ్లోరియస్ నేషన్) సంస్థ వారి స్వామి వివేకానంద గురుకుల ఆశ్రమ పాఠశాల. 

-పృథ్వీరాణి, శృతి
ఉస్మానియా మెడికల్ స్టూడెంట్స్ ఫర్ సర్వీస్ అండ్ డెవలప్‌మెంట్ అధ్యక్ష, కార్యదర్శులు

  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: జాతిని మేల్కొల్పిన ధీరుడు - స్వామి వివేకానంద Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh