Download |
జ్ఞానఖని వివేకుని సుందర స్వప్నం
సాకారం చేయుటకై కావాలి యత్నం
చేయి చేయి కలిపి మన భవిత బాట తెలిపి
నడుంకట్టి భుజం తట్టి నడవాలి అందరం
!జ్ఞానఖని వివేకుని!
నేటి విద్య సారం భౌతిక సుఖముల తీరం
ప్రాశ్చత్యపు ఒరవడిలో నిజ సంస్కృతీ నిస్తేజం
వ్యక్తీ లోని శక్తిని మేల్కొపుటయే విధ్యయని
ఘోసించిన నరేంద్రుని మాట బాట కావాలి
!జ్ఞానఖని వివేకుని!
ఉన్మాదపు మార్గంలో యువత అడుగులిడకుండా
ఉప్పొంగే యువశక్తి చెడు తలపుల పడకుండా
దేశ హితమే లక్ష్యంగా యువ లోకం కదలాలి
తమ గమ్యం చేరువరకు ఆగకుండా సాగాలి
!జ్ఞానఖని వివేకుని!
తమ సౌఖ్యం త్యజియించి పరుల కొరకు తపియించి
దీన జనుల ఉద్దరణకు మనమంకితం అవ్వాలి
కొండలలో అణగారిన గుండెలలో కొలువుంటూ
నరుడే నారాయణుడని తలచి సేవ చేయాలి
!జ్ఞానఖని వివేకుని!
0 comments:
Post a Comment