మెట్ పల్లి , 12/01/2013 , నాగరాజు గోల్కొండ ( ప్రతినిది - రాష్ట్ర చేతన )
 |
మాట్లాడుతున్నా శ్రీ దేవేందర్ జి |
జగిత్యాల్ జిల్లా జగిత్యాల నగరం లోని అరవింద నగర్ - పురానిపేట్ శాఖ యొక్క వార్షికోత్సవం గత వారం 3.2.2013 ఆదివారం రోజున జరిగినది . ఇట్టి కార్యక్రమానికి శ్రీ పెడపెల్లి దేవేందర్ రెడ్డి , సహా ప్రాంత ప్రచారక్ గారు ప్రధాన వక్త గా విచ్చేశారు .
కార్యక్రమం యొక్క విశేషాలు క్రింద తెలుపబడినాయి .
 |
స్వయం సేవకుల విన్యాసం |
- ఈ కార్యక్రమానికి నగరం లోని ప్రముఖ వైద్యులు శ్రీ పోహార్ సృజన కుమార్ ముఖ్య అతిథి గా విచ్చేశారు . వారితో పాటు నగర సంఘ చాలకులు శ్రీ జిడిగే పురుషోత్తం గారు , జిల్లా కార్య వాహ మరియు సహా కార్యవాహ శ్రీ గోనే భూమయ్య , శ్రీ ఎన్నమనేని అశోక్ రావ్ గారు , విభాగ్ ప్రచారకులు శ్రీ రామాంజనేయులు గారు, జిల్లా ప్రచారక్ శ్రీ దేవేందర్ రాజు గారు కార్యక్రమం లో ఉన్నారు .
- నగరం లోని ఆ బస్తి ప్రధాన వీధులగుండా శోభాయాత్ర జరిగింది . బాల 65 తో పాటు తరుణ 10 మంది స్వయం సేవకులు పాల్గొన్నారు . చక్కటి సంచలన్ చేశారు . మార్గం గుండా వెళుతున్న స్వయంసేవకులకు మంగళహారతులతో స్వాగతం పలుకుతూ ద్వజం పై పుష్పాలు చల్లారు .
- అంతా బాల అవడం తో బస్తి మొత్తం వారి ఇంటిల్లి పాదులతో కోలాహలం కనిపించింది .మాతలు 20 మంది వచ్చారు .
- వచ్చిన అతిథులు మాతలు ప్రజలు స్వయంసేవకుల శారీరక్ ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు.
- శ్రీ సృజన్ గారు మాట్లాడుతూ సంఘం చిన్నారుల్లో దేశభక్తి ని క్రమశిక్షణను అలవరుస్తున్నదని అన్నారు . నేటి పరిస్థితుల్లో సంఘం అవసరం దేశానికి ఎంతో ఉందని అన్నారు.
- కార్యక్రమాన్ని ముఖ్యశిక్షక్ చి. వంశీ బాగా నిర్వహించగా శాఖా కార్యవాహ చందోలి శ్రీను శిక్షక్ లు కట్ట సుమన్ గట నాయకులు సాయి చంద్ , నీరజ్ , సాయి ధనుష్ ,ప్రీతం , ప్రార్థన ప్రముఖ్ అనిల్ అలాగే నగర టోలి శ్రీ సంతోష గారు , మాసం రమేష్ అంతా కలిషి జట్టు గా సహకరించారు .
- వక్త శ్రీ దేవేందర్ గారు మాట్లాడుతూ
- స్వయంసేవక్ నీతి నిజాయితీకి మారు పేరు గా ఉండాలి . సంస్కారాలకు , క్రమ శిక్షణకు సంఘం పెట్టింది పేరు.
- సంఘం దేశ ధర్మ హింతం కోరే సంస్థ .
- వ్యక్తీ నిర్మాణం ద్వారా సమాజ నిర్మాణం మన ఆశయం .
- వార్షికోత్సవాలు కార్యకర్తల్లో విశ్వాశాన్ని నింపుతాయి .
- ప్రతి శాఖ వార్షికోత్సవాలు జరపాలి . తద్వారా కార్యకర్తల్లో స్థాయి పెరుగుతుంది.
0 comments:
Post a Comment