Download |
నాది అన్నది ఏది లేదు - ఉన్నదంతా నీదే నీదే - ఇదం నమమ భారతాంభా !!2!!
!! చరణం !!
వైరి గుండెల చీల్చి చెండిన వీర పుత్రుల బడసినావు
ధ్యాగ ధనమున తరవులయ్యిన ఋషుల మునులను పెంచినావు
వారి ఆశయ పథమునెంచి - వారి వారసులయ్యి నిలిచి (2)
పుణ్య ఫలమున నీదు పుత్రుడా - నా పుణ్య ఫలమున నీదు పుత్రుడా
చేరినాను చరణములకడ
!! ఇదం నమమ !!
సూర్య గమనము యముని మనమును మార్చివేసిరి పుణ్య సతులు
ఉగ్గు పాలన కార్యసిద్ధిని రంగరించిరి మాతృమూర్తులు
వారి తనువు అనువు నేనై - వారి వైభవ కీర్తి పథమై (2)
ఎన్ని జన్మలకైనా గాని - నీదు పాదము విడువ జనని
!! ఇదం నమమ !!
మోక్షమును కాంక్షించబోను స్వార్థ చింతల పాలుకాను
జడమైన బ్రతుకున జీవింతాంతము రాతినైతే ఏమి ఫలము
నీదు పాదము కందకుండగా నిమిషాన వాడిన సుమమే చాలు
కోట్ల బిడ్డల కల్పవల్లి - కోరి అర్పించేదను తల్లి
!! ఇదం నమమ !!
0 comments:
Post a Comment