728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Saturday, 10 September 2011

శాంతిని సంకల్పించే శంఖారావం - VIjayaVipanchi


శాంతిని సంకల్పించే శంఖారావం
సురసీమను తలపించే సంఘీభావం
ఇదే ఇదే నవ భారత గీతాసారం
కాంచిన కాంచన స్వప్నపు సాక్షాత్కారం   || శాంతిని ||

దేశం ఏమిచ్చిందని దూషించుట దోషం
దేశానికి ఏమిస్తే తీరును ఋణ శేషం
బ్రతుకిచ్చిందెవరు మెతుకిచ్చిందెవరు
ఆకాంక్షలకాధారం చూపించిందెవరు   || శాంతిని ||

కాలి గోరు గాయ పడితే కంట నీరు తీరగదా
వేరు చివర చీడ పడితే చిగురు నేలకొరగదా
ప్రాంతం ఏదైనా భాషలు వేరైనా
దేశమంత ఒక్కటన్నదేహ స్పర్శ పోవునా   || శాంతిని ||

  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: శాంతిని సంకల్పించే శంఖారావం - VIjayaVipanchi Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh