728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Wednesday, 28 September 2011

విశ్వ యోధుల విజయ గానం మహానాదం వినండోయ్ - VijayaVipanchi



విశ్వ యోధుల విజయ గానం మహానాదం వినండోయ్
వీర హైందవ సింహనాదం నాంది పలికే మహానాదం  ||మహానాదం||


విజయమే అను వీర శంఖపు గగన ఘోషను వినగ రండోయ్
రసమయ్యమగు వంశి రవముల రుచులనెన్నో చూడరండోయ్
ధ్వం ధ్వమ్మను పణవ ధ్వనితో పదం పాడగ పదండోయ్
ఝణణ ఝణణను ఝల్లరులతో కదన మాడగ కదలిరండోయ్  ||మహానాదం||


అసుర బలమును మట్టుబెట్టిన ఉగ్ర నరసింహుని నినాదం
రావణుని సంహర మొనర్చిన రామబాణపు హూంకారం
శత్రు శిర విచ్చేద  శస్త్రం సుదర్శన రణ ఘీంకారం
అరి భయంకర భరత సైనిక వీర వర విజ్రుమ్భణం ||మహానాదం||


దేశ ధర్మోద్ధరణ చేద్దాం శత్రు శేషం త్రుంచి వేద్దాం
వ్యక్తి వ్యక్తిని సంస్కరించి జాతి శక్తిగ మలచి వేద్దాం
నిత్య సాధన తంత్ర పథమున సంఘటితముగ సాగుదాం
పరమవైభవ దివ్య మంత్రం నరనరమ్మున నింపుదాం  ||మహానాదం||

  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: విశ్వ యోధుల విజయ గానం మహానాదం వినండోయ్ - VijayaVipanchi Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh