728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Thursday, 1 September 2011

రామ్‌దేవ్‌పై ఫెమా ఉల్లంఘన కేసు - ప్రారంభమైన కక్ష సాదింపు


న్యూఢిల్లీ: తనకు గిట్టనివారిపై కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. దీనికి దర్యాప్తు సంస్థలను పావుగా ఉపయోగించుకుంటోంది. తాజాగా యోగా గురు రామ్‌దేవ్‌పై ఫెమా ఉల్లంఘన కింద కేసు నమోదు చేయడం దీనికి నిదర్శనమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రతిపక్ష బీజేపీ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. గురువారం రామ్‌దేవ్, హరిద్వార్‌లోని ఆయన ట్రస్టులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) విదేశీ మారకద్రవ్య నిల్వల ఉల్లంఘన కేసు నమోదు చేసింది.

ఆయన ట్రస్టుల అనుమానాస్పద ఆర్థిక కార్యకలాపాలపై ఆర్‌బీఐ నివేదిక, విదేశీ సమాచారాల ఆధారంగా విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) కింద కేసులు నమోదు చేసినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. దర్యాప్తులో భాగంగా రామ్‌దేవ్ విదేశీ కార్యకలాపాలకు కేంద్రంగా, వెల్‌నెస్ సెంటర్‌గా పని చేస్తున్న స్కాట్లాండ్‌లోని లిటిల్ కుంబ్రే ద్వీపం గురించిన ఆర్థిక వివరాలివ్వాల్సిందిగా ఇంగ్లండ్‌ను ఈడీ కోరింది.

ముఖ్యంగా స్కాట్లాండ్‌కు చెందిన ఓ జంట సుమారు 20 లక్షల డాలర్ల విలువజేసే ఈ దీవిని రామ్‌దేవ్‌కు కానుకగా అందించడానికి సంబంధించిన వివరాలను కూడా ఈడీ తెలుసుకోనుంది. మడగాస్కర్ దేశాన్ని (ఆఫ్రికా ఖండంలోని దీవి) కూడా మరికొన్ని ఆర్థిక వివరాలు కోరింది. దీనికి సంబంధించి 50కిపైగా కంపెనీలపై కూడా నిఘా పెట్టనుంది. పతంజలి యోగపీఠ్ ట్రస్టు, దివ్య యోగ మందిర్ ట్రస్టు, భారత్ స్వాభిమాన్ ట్రస్టు తదితరాల్లోకి నగదు రాకపోకల తనిఖీయే లక్ష్యంగా ఈడీ దర్యాప్తు సాగుతున్నట్టు సమాచారం. దీనిపై ఈడీ త్వరలోనే రామ్‌దేవ్, ఆయన ట్రస్టులకు సమన్లు కూడా జారీ చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఈ వ్యవహారంపై రామ్‌దేవ్ ప్రతినిధి ఎస్.కె. తిజారావాలా స్పందిస్తూ... తమ సంస్థలన్నీ చట్టాలకు అనుగుణంగా నడుస్తున్నవేనని చెప్పారు.

ఏ తప్పూ చేయలేదు... రామ్‌దేవ్: తనపై ఈడీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో రామ్‌దేవ్ స్పందించారు. తాను ఎటువంటి తప్పు చేయలేదని గురువారం హరిద్వార్‌లో వివరణ ఇచ్చారు. రెండు దశాబ్దాల ప్రజాజీవితంలో తనపై వచ్చిన ఆరోపణలకు రుజువులతో బదులిచ్చానని చెప్పారు. ఈడీ నోటీసు అందాక స్పందిస్తానన్నారు.
  • Blogger Comments
  • Facebook Comments

1 comments:

  1. not only that, they also started IT cases on Aravind Kajriwal.. chattam tanapani taanu chesukupotundi.. (Only meeru against ga matladinappudu maatrame. :)).

    ReplyDelete

Item Reviewed: రామ్‌దేవ్‌పై ఫెమా ఉల్లంఘన కేసు - ప్రారంభమైన కక్ష సాదింపు Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh