728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Saturday, 24 September 2011

శౌర్య క్షిపణి పరీక్ష విజయవంతం

భూఉపరితలం నుంచి లక్ష్యాన్ని ఛేదించే అణు సామర్ధ్యం గల మీడియం రేంజ్‌ శౌర్య క్షిపణిని శనివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఒరిస్సా తీరంలోని చందీపూర్‌ నుంచి డిఆర్‌డిఒ విజయవంతంగా ప్రయోగించింది. డిఆర్‌డిఒకు చెందిన ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌లోని భూగర్భ స్థావరం నుంచి దీనిని ప్రయోగించారు. 750 కి.మీ.దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూడా ఇది ఛేదించగలదు. అటు సైన్యం, ఇటు నావికాదళం కూడా ఉపయోగించేందుకు వీలుగా దీనిని అభివృద్ధి చేస్తున్నారు. ఒక టన్ను బరువుగల బాంబులను ఇది మోయగలదు. ఇది రెండు దశలలో పనిచేస్తుంది, సంప్రదాయ, అణు బాంబులను కూడా దీని ద్వారా ప్రయోగించవచ్చు.

దాదాపు పది మీటర్ల పొడవు అరమీటరు వెడల్పుతో దీనిజూని తయారు చేశారు. దీర్ఘకాలం మన్నేందుకు ఘన ఇంధనాన్ని దీనికి ఉపయోగిస్తున్నారు. ద్రవ ఇంధనాన్ని ఉపయోగించే క్షిపణులతో పోలిస్తే దీని లాంచ్‌ టైమ్‌ చాలా తక్కువ. వేగవంతమైన చలనశీలత కోసం తయారు చేస్తున్న ఈ క్షిపణిని భూగర్భ సొరంగాల నుంచి కూడా ప్రయోగించవచ్చు. అణ్వాయుధాలను మొదటగా ప్రయోగించకూడదన్న దేశ ఉద్దేశాలకు అనుగుణంగా దీనిని సెకెండ్‌ స్ట్రైక్‌ సామర్ధ్యంతో తయారు చేస్తున్నారు. శౌర్యకు సంబంధించిన ఆఖరి పరీక్షలు 2008, నవంబర్‌లో నిర్వహించారు. పరీక్షల సందర్భంగా ఆ పరిసరాలలో రెండు కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్న వారందరినీ తాత్కాలికంగా వేరో చోటికి పంపారు
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: శౌర్య క్షిపణి పరీక్ష విజయవంతం Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh