728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Tuesday, 27 September 2011

మతహింస బిల్లు దేశాన్ని రెండుగా చీలుస్తుంది : శ్రీ మోహన్ భగవత్


జమ్మూ సెప్టెంబర్ 25 : దేశం వెలుపలి, లోపలా పొంచి ఉన్న ముప్పుకు వ్యతిరేకంగా పోరాడే సకల్పం, చిత్తశుద్ధి కేంద్ర ప్రభుత్వానికి కొరవడిందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ విమర్శించారు. ఆదివారం జమ్మూ లో  ఆయన ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ దేశానికి అంతర్గతంగా పొంచి ఉన్న ముప్పుకు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడే నిబద్ధత కాని, పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ వంటి పొరుగు దేశాలు మన సరిహద్దులను మారుస్తున్నా వాటి చర్యలను తిప్పికొట్టే తెగువ కాని ప్రభుత్వానికి లేవని అన్నారు.
సరిహద్దుల నుంచి దేశంలోకి చొరబాట్లు పెరుగుతున్నాయని, మన దేశ సరిహద్దులను మార్చివేస్తున్నారని, ఇది జాతికి మంచిది కాదని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా చైనా మనల్ని బెదిరిస్తూ సరిహద్దులను మార్చివేస్తోందని ఆయన వివరించారు. ఆగస్టులో చైనా బలగాలు భారత భూభాగంలోకి చొచ్చుకొని వచ్చి లడఖ్‌లోని చుర్‌ముర్ ఏరియాలో మన బంకర్లను కూల్చివేసినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు. దక్షిణ చైనా సముద్రంలో భారత్ చమురు అనే్వషణ కార్యకలాపాలు చేపట్టరాదని చైనా హెచ్చ
రించినట్లు వచ్చిన వార్తలను ఆయన ఉటంకించారు. చైనా-పాకిస్తాన్‌ల మధ్య స్నేహం మరింత గట్టిపడిందని, పాక్-చైనాల మధ్య బంధం బలపడిందని ఆయన వివరించారు. మనకు ఇదెంతో ఆందోళన కలిగించే అంశమన్నారు. ఐదు రోజుల పర్యటన నిమిత్తం భగవత్ జమ్ము రీజియన్‌కు వచ్చారు

  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: మతహింస బిల్లు దేశాన్ని రెండుగా చీలుస్తుంది : శ్రీ మోహన్ భగవత్ Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh