728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Wednesday, 10 August 2011

ఒక దీపం తో మరియొక దీపం వెలిగించాలి - Vijaya Vipanchi



ఒక దీపం తో మరియొక దీపం వెలిగించాలి
హిందువులో చైతన్య దీప్తిని రగిలించాలి


నేను నాది నా యిల్లన్నది ఈనాటలవాటు
మనమూ మనదీ మనదేశమ్మని కావాలలవాటు
హిందువులంతా ప్రతి దినమూ కలసీ మెలసీ ఒక చో చేరి
అమ్మ భరతిని కీర్తిస్తూ పంచుకోవాలె మమకారం
పెంచుకోవాలె సంస్కారం


వ్యక్తి వేరనీ సమష్టి వేరని తలచితిమిన్నాళ్ళూ
వ్యక్తి శ్రేయమూ సమిష్టి లోనే సమిష్టి లేనిదే వ్యక్తి లేడనీ
సమాజరూపీ సర్వేశ్వరునీ సేవించుటయే తరుణోపాయం
వ్యక్తి సుఖించును ఇహ పరమ్ముల ఇదియే కాదా మన ధర్మం
హిందువు మరచెను ఈ మర్మం


కొండల జనులు కోనల ప్రజలు నగరవాసులు గ్రామ వాసులు
పండితులైనా పామరులైనా కుబేరులైనా కుచేలురైనా
తరతమ భేదం లేనే లేదు తల్లి దృష్టిలో సమానమే
పరమాత్ముని కృపకు పాత్రులన్నది హైందవ తత్వం వేదాంతం
ఆచరించడమె పరమార్ధం


దేశ ధర్మముల నిలిపెడి హిందువు పుడమి తల్లికై బ్రతికెడి హిందువు
శీలం జ్ఞానం కలిగిన హిందువు శక్తియుక్తులా నెరపెడి హిందువు
మానవతను మన్నించే హిందువు దానవతను దమనించే హిందువు
ప్రఖర తేజముతొ ప్రతీప శక్తుల పరిమార్చించాలి
ప్రగతిగామియై పరాక్రమించాలి


  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: ఒక దీపం తో మరియొక దీపం వెలిగించాలి - Vijaya Vipanchi Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh