728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Wednesday, 10 August 2011

నమో జనని భారతావనీ సకల సౌఖ్య సంధాయినీ - Vijaya Vipanchi



నమో జనని భారతావనీ సకల సౌఖ్య సంధాయినీ


గిరులందున తరులందున వనులందున గనులందున
కోటి కోటి కంఠాలలో నీ కీర్తియే ప్రతిధ్వనించు ఈ జగమే పరవశించు


ధర్మ రతుల కర్మ యుతుల గిరికానన పురవాసుల
విజ్ఞానుల అజ్ఞానులలో నీ రూపమే మాకు దోచు ఏకాత్మత యెదలబూచు


శాస్త్రజ్ఞుల శోధనలో ధర్మజ్ఞుల బోధనలో
వీరవ్రతుల వరసాధనలో నీ దీక్షయె వెల్లివిరియు నీ దక్షత జల్లు కురియు


యువజనముల కవిగణముల యోధవరుల యోగిమణుల
కార్మిక కర్షక జనాలలో నీ శక్తియె పొంగి పొరలు నీ ప్రతిభయె దిశలమెరయు

  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: నమో జనని భారతావనీ సకల సౌఖ్య సంధాయినీ - Vijaya Vipanchi Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh