కలసి ఉందాం కలుపుకుందాం ఇదేరా మన బలం ధర్మం , ఇదేరా మన బలం ధర్మం
గడ్డి పరకలు వేరుపడితే గట్టితనమేముందిరా
కలసి త్రాడుగా మారితే అది గజమునే బంధించురా || కలసి ఉందాం ||
మేఘములు విడిపోయి కురిసిన చినుకు చినుకై పోవురా
చుక్కలన్నీయు ఒక్కటైతే చూడ సంద్రమ్మౌనురా || కలసి ఉందాం ||
స్వార్ధపరుల కుతంత్రములకు జాతి పతనమ్మయ్యేరా
హిందువులు సంఘటితమైతే జాతి వైభవమందురా || కలసి ఉందాం ||
0 comments:
Post a Comment