728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Wednesday, 10 August 2011

ఒకటే దేశం మనది నిజం నిజం - Vijaya Vipanchi



ఒకటే దేశం మనది నిజం నిజం


ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం


వర్ణములేవైనా మరి కులములేన్నునా


వనంలోని చెట్లు మనం వసుదైక కుటుంబకం || ఒకటే దేశం ||




భరతుడు పరిపాలించిన భారతదేశం మనది


తరతరాల వారసత్వ సంపద మనకున్నది


చెయ్యి చాచి యాచించే అవసరమేమ్మునది


అంతకన్న హీనమైన బ్రతుకింకేమున్నది || ఒకటే దేశం ||






వాల్మీకి మనవాడే వ్రాసాను రామాయణం


వ్యాసుండేవరో కాదు వ్రాస మహాభారతం


అష్టాదశ పురాణాలు అంతులేని ధర్మాలు


అందించిన ఋషులందరూ వందనీయులే మనకు || ఒకటే దేశం ||




గుండెలలో భగవంతుని బంధించిన భక్తులు


ప్రకృతినే శాసించిన పతివ్రతా మూర్తులు


సత్యాన్వేషణకై తమ సర్వస్వాన్నర్పించిన


త్యాగులు యోగులు భళిరే వితరాగులెందరో || ఒకటే దేశం ||

  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: ఒకటే దేశం మనది నిజం నిజం - Vijaya Vipanchi Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh