నిత్య సాధనా పథమున నిలిపిన ఓ కేశవా
నీ అడుగుజాడలలో సాధన కొనసాగిస్తాం
పసిప్రాయములోనే నీవు తోటివారి కూడగట్టి
పరదేశీ పెత్తనాన్ని తలదాల్చక ఎదురు తిరిగి
స్వాభిమాన శంఖమ్మున సాహసముగ పూరించి
వందేమాతరమంటూ బడిలో నినదించినావు
విజాతీయ దాడులతో స్వార్ధపరుల కుట్రలతో
వికలమైన హిందు జాతి చారిత్రక దుస్థితిని
నిశితముగా పరికించి లోపమ్మును గ్రహియించి
సంజీవని నిచ్చినావు సంఘ శాఖ పెట్టినావు
నీ నరములు వత్తులుగా నీ నెత్తురు చమురుగా
హిందు జాతి సంఘటనకు శక్తినంత ధారవోసి
తిమిరమ్మును తొలగించగ దీపముగా నీవు వెలిగి
హిందు దేశమంతటా దివ్వెలు వెలిగించినావు
0 comments:
Post a Comment