728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Monday, 1 August 2011

దీక్షాధారణ శుభోత్సవం - ఇదే రక్షాబంధన మహోత్సవం - Vijaya Vipanchi



దీక్షాధారణ శుభోత్సవం - ఇదే రక్షాబంధన మహోత్సవం
తరతరాలుగా భారతావనిలో - ధర్మస్థాపనకు నాందిగ నిలిచిన ||దీక్షా||


త్రిపురాసులను దహింపజేసి - దానవ శక్తుల దర్పమడచంగ
సాత్విక శక్తుల సంఘటించగా - త్రినేత్రుడే తన త్రిశూలమెత్తి
ముందునకురికిన ముహూర్తమిదియే - దీక్షాధారణ శుభోత్సవం ||దీక్షా||


యవనుల దాడుల నెదిర్చి గెలిచి - సీమోల్లంఘన చేయు క్షణముకై
చంద్రగుప్త, పురు, చాణక్యాదులు - సర్వశక్తులను సమీకరించగ
ప్రారంభించిన పర్వదినంబిదె - దీక్షాధారణ శుభోత్సవం ||దీక్షా||


దేశములోపల ద్వేషాసూయల - ఈర్షాభయముల నిహ సుఖవాంఛల
పంచమాంగదళ వంచన చేష్టల - శత్రు ఆక్రమణ శమింప జేయగ
హిందూ యువకులు ముందున కురికే - దీక్షాధారణ శుభోత్సవం ||దీక్షా||


స్నేహ ప్రేమలను సూత్రము లోపల - హృదయ పుష్పముల బంధించి
సమాజ ధర్మం సమాచరింపగ - ఒకరికి తోడుగ నొకర ముందుమని
రక్షల కట్టెడి రమ్య క్షణంబిదె - దీక్షాధారణ శుభోత్సవం ||దీక్షా||

  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: దీక్షాధారణ శుభోత్సవం - ఇదే రక్షాబంధన మహోత్సవం - Vijaya Vipanchi Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh