Reported By : శ్రీ చంద కిరణ్ ( రాష్ట్ర చేతన - ప్రతినిది )
![]() |
ప్రసంగిస్తున్న శ్రీ శ్రీ శ్రీ స్వామి పరిపూర్ణనంద సరస్వతి |
19/03/2013 కరినగరం : హిందూ సంఘటన తోనే మన దేశ పునర్ వైభవం సాధ్యమని మన దేశం మన ధర్మం అనే నినాదం తో కరినగరం ఆర్ట్ కళాశాల మైదానం లో ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో జరిగిన " హిందు శంఖారావం " ఉద్ఘాటించింది . ఈ కార్యక్రమానికి హాజరైన కాకినాడ శ్రీ పీఠం పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వామీ పరిపూర్ణనంద సరస్వతి మార్గదర్శనం చేస్తూ " అన్ని మతాలను గౌరవించేదే హిందూ మతమని పేర్కొన్నారు. హిందువులు ఆదరిస్తేనే ఇతర మతాలు మనగలుగుతున్నాయని, అందుకు బదులుగా వారు దానవత్వాన్ని ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. ఎవరికీ హాని చేయని మతం హిందూ మతమని అన్నారు. దేశంలో అతి పెద్ద మతంగా గుర్తింపు పొందిన హిందూ మతస్తులపై కొన్ని మతాల వారు మత మార్పిడికి పాల్పడుతుండగా, మరి కొందరు బాంబులతో దాడి చేస్తూ మారణకాండ సృష్టించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఏఐఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు. గో మాంసం తినాలని, 15 నిముషాల సమయం ఇస్తే హిందువులను ఊచకోత కోస్తానని అనడం బాధాకరమని పేర్కొన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపడంతో కటకటాలు లెక్కించాడని, తాను అలా అనలేదని మాట మార్చడం సబబు కాదన్నారు.అక్బరుద్దీన్‌కు శరీరంలో బుల్లెట్లు దిగినప్పుడు, కత్తి గాయాలైనప్పుడు వైద్యం అందించింది హిందూ ఆస్పవూతేనని, హిందు వైద్యులేనని అన్నారు. ఒవైసీ ఆసుపత్రి ఉన్నప్పటికీ నమ్మకం లేకనే హిందూ ఆస్పవూతిలో చేరి ఆరోగ్యం మెరుగుపరుచుకున్నారని గుర్తు చేశారు. మతాన్ని మతంగానే చూడాలని, మతాన్ని రాజకీయాల్లోకి లాగొద్దని సూచించారు. హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబులు పెట్టి ముస్లింలు, హిందువులు, క్రైస్తవుల మృతికి కారకులయ్యారని, ఇక్కడ మరణించింది మతం కాదని మానవులని అన్నారు. మానవత్వం లేనప్పుడు దైవత్వమెందుకని అన్నారు. హిందువులందరూ ఒకే గొడుగు కిందకు రావాలని పిలుపునిచ్చారు. సంఘటితంగా ఉంటూ దేశాన్ని కబళించాలని చూసే దుష్ట శక్తులను పారదోలాలని అన్నారు.
తదనంతరం శ్రీనివాసానంద స్వా మీజీ మాట్లాడుతూ భారతీయులమని గర్వంగా చెప్పుకోవాలని, దేశ రక్షణే మనకు ఊపిరి కావాలని పేర్కొన్నారు. హిందూ ధర్మ ప్రచారకులు ప్ర మోద్ చైతన్య మాట్లాడుతూ అన్ని మతాలూ స మానమేనన్నారు. హిందూ ధర్మ రక్షణ స్థాపన కోసం అంతా కృషి చేయాలన్నారు
కళాకారుల వేదికపై నుంచి కేబీ శర్మ బృందం ఆలపించిన అన్నమయ్య కీర్తనలు అలరించాయి. గోగుల ప్రసాద్, ఆదిత్య, బెజ్జంకి రాధాకృష్ణ, సుం కె వెంకటాద్రి, వైష్ణవి, మునికుమారి, అక్షిత, రం జిత రాపాక సాయికృష్ణ(అంధుడు) కీర్తనలు ఆలపించారు.
పాస్టర్ కుటుంబం హిందుత్వం లోనికి పునరాగమనం :
స్వామీ పరిపూర్ణనంద సరస్వతి సమక్షంలో పాస్టర్ గా పనిచేస్తున్న మన్నే సురేందర్ కుటుంబం హిందుత్వం లోనికి పునరాగానం అయినది ఈ సందర్బంగా సురేందర్ మాట్లాడుతూ మా పూర్వికులు కొన్ని తరాల పూర్వం క్రైస్తవం లోనికి మారారని , నేను పుట్టినప్పటి నుండి క్రైస్తవుడిగానే పెరిగానని కాని ఎక్కడో లోటు కనిపించందని తర్వాత నా మాతృ ధర్మమైన హిందుత్వాని తిరిగి స్వీకరించాలని అనుకున్నానని ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్వుతుండగా శివలింగం బయల్పడడంతో ఆ భగవంతుడు నన్ను అనుగ్రహించాడని భావిస్తున్నాని అన్నారు .
![]() |
పునరాగమనం చెందిన కుటుంబ పాస్టర్ మరియు సభ్యులు |
హిందు శంఖారావం తీర్మానాలు :
- కరీంనగర్ పేరు ను కరినగరము గా మార్చాలి
- సంస్కృత భాషను స్వాగతిస్తూ నేర్చుకోవాలి .
- మత మార్పిడులకు పాల్పడే వారిపై నాన్ బైలేబుల్ వారంట్ లతో చర్యలు తీసుకునే లా ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలి .
- రాష్త్రం లో గోవధ నిషేధ చట్టాన్ని మరింత పగడ్బందీ గా అమలు చేస్తూ గోవధ శాలలు ఎత్తివేసేలా ఉద్యమం చేపట్టాలి .
- అమర్నాథ్ యాత్రకు వెళ్ళే హిందువులకు రాయితీలు కల్పించేలా ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలి .
- రాష్త్రం లోని హిందూ దేవాలయాల పరిరక్షణకు ఒక్కో శాసన సభ్యుడు భాద్యత గా 25% నిధులను ఖర్చుపెట్టాలి .
- హిందూ సంస్కృతి గ్రంథాల పై అనవసర ఆరోపణలు చేసే వారిని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టులకు తిప్పించేలా కరినగరం లో లీగల్ సెల్ ఏర్పాటు చెయ్యాలి . ఈ వ్యవస్థ ను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తారు .
- సనాతన ధర్మాలు హిందూ సంస్కృతి ఇతిహాస చరిత్రలు విద్యార్థులకు తెలిసే లా పాట్య పుస్తకాలలో ముద్రించాలని దీని సాధనకు కరినగర్ నుండే ఉద్యమం మొదలు అవుతుంది.
a great effort by karinagar hindus !
ReplyDelete