728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Monday, 11 March 2013

స్వదేశీ జాగరణ్ మంచ్ అధ్వర్యంలో ఉచిత వైద్య శిభిరం 5 గ్రామాల నుండి 730 మందికి లబ్ది

Source : Appla Prasad Ji's FaceBook Page



09-Mar-2013 , మెదక్ : మెదక్ జిల్లా మిడిదొడ్డి మండలం , అందే గ్రామంలో తేది 09-03-2013 నాడు స్వదేశీ జాగరణ్ మంచ్ , స్థానిక యువజన సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో స్వామీ వివేకానంద 150 వ జయంతి ఉత్సవాలలో భాగంగా  ఉచిత వైద్య శిభిరం నిర్వహించడం జరిగింది  శ్రీ అప్పల ప్రసాద్ గారు ( స్వదేశీ జాగరణ్ మంచ్ ఆంద్ర ప్రదేశ్ , కర్ణాటక రాష్ట్రాల సంయోజకులు రోజంతా ఉండి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు   . 

ఈ కార్యక్రమంలో Dr అనిల్ కుమార్ ENT, Dr శ్వేతా గ్లైనిక్ , Dr నాగ సంగాప్పా Eye specialist , Dr మహేష్ ఆర్థో మరో అయిదు గురు వైద్య నిపుణులు హాజరై చుట్టూ ప్రక్కల 5 గ్రామాల నుండి వచ్చిన 730 మందికి వైద్య పరిక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణి చేయడం జరిగింది .

ఈ వైద్య శిభిరానికి హాజరైన ప్రజలకు గ్రామానికి చెందిన యువజన సంఘాల సభ్యులు స్వదేశీ జాగరణ్ మంచ్ ఆధ్వర్యలో త్రాగునీరు , మధ్యాహ్నం భోజనం , లాంటి  అన్ని మౌలిక ఏర్పాట్లు చేయడం జరిగింది , శ్రీ వెన్నెల మల్లా రెడ్డి విభాగ్ సంయోజకులు వీరికి కార్యక్రమ నిర్వహణలో మంచి మార్గదర్శనం ఇచ్చారు , బుర్ర సతీష్ , సుమన్ , శ్రీనివాస్ , రామచందర్ , జనార్ధన్ , నరేష్ , మహర్షి ,స్వప్న లతో పాటు గ్రామానికి చెందినా మరో 30 మంది యువతి యువకులు ఈ కార్యక్రమ నిర్వహణలు వాలంటీర్లుగా వ్యవహరించారు . 

గ్రామానికి చెందిన అన్ని కుల సంఘాల పెద్దలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు కులాల పేరుతొ ప్రజల మధ్య దూరం పెరుగున్నఈ తరుణంలో ఏకులమైనా అంతరం కలిసి మెలిసి ఉంటే నే గ్రామ సమగ్రాభివృద్ది దానితో దేశాభివ్రుద్ది సాధ్యమౌతుందని ఈ సందర్బంగా గ్రామంలో తీర్మానించుకున్నారు . 

  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: స్వదేశీ జాగరణ్ మంచ్ అధ్వర్యంలో ఉచిత వైద్య శిభిరం 5 గ్రామాల నుండి 730 మందికి లబ్ది Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh