Reported By : యోగేశ్వర్ ఖాందేశ్ ( ప్రతినిధి రాష్ట్ర చేతన )
శ్రీ రాం ప్రసాద్ జి మార్గదర్శనం |
17/03/2013 , కామారెడ్డి జిల్లా , కౌలస్ : కామారెడ్డి జిల్లా కుటుంబాల సహల్ తేది 17/03/2013 నాడు జుక్కల్ మండలం కౌలాస్ గ్రామ కోట నందు ప్రక్రుతి మాత రమణీయలతల మధ్య ఉత్సహంగా జరిగింది సుమారు 40 సంఘ కార్యకర్తల కుటుంబాలకు చెందిన 150 మంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు . ఈ కార్యక్రమానికి ముఖ్య వక్త గా హాజరైన శ్రీ రాం ప్రసాద్ గారు ( ప్రాంత కార్యకారణి సదస్యులు ) మార్గదర్శనం చేస్తూ సంఘ కుటుంబాలు ఉన్నత జీవన విధానంతో సమాజానికి ఆదర్శ ప్రాయంగా జీవించాలని అన్నారు , కుటుంబ సభ్యుల సహకారం లేనిదే సంఘ కార్యకర్తలు సమాజ కార్యంలో పనిచేయడం సాధ్యం కాదని , ఒక కుటుంబ జీవనానికి మూలం ఇంటి ఇల్లాలు అని , ఆమె మాత్రమె ఈ దేశానికి మరో శివాజినిచ్చి , జిజియా మాత గా , మరో వివేకాందుడిని ఇచ్చి మాతా భువనేశ్వరి దేవిగా మారాలని ఆ శక్తి ఇంటి ఇల్లాలుకి మాత్రమె ఉందని ఆన్నారు .
ఈ కార్యక్రమములో అందరు చాలా ఉత్సాహంగా పాలోన్నారు , అనేక రకాల ఆటలు , ప్రహేళిక లాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది , " ఆదర్శ హిందు కుటుంబం " అనే అంశం పై జరిగిన చర్చ అందరిలోని వ్రక్రుత్వ కల ను బయటికి తెచ్చింది , ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవాహ శ్రీ ఈగ గణపతి రెడ్డి గారు , జిల్లా సహా కార్యవాహ శ్రీ కోట రాజులు గారు , జిల్లా ప్రచారక్ శ్రీ గంగ రాజులు గారు, శ్రీ పంతంగి కిరణ్ గారు తదితరులు పాల్గొన్నారు , శ్రీ శివకాంత్ గారు , ఎన్నావార్ శ్రీనివాస్ గారు , శ్రీ భానుదాస్ గారు చక్కని వ్యవస్థ ఏర్పాటు చేసారు .
0 comments:
Post a Comment