Download |
స్వామీ వివేకుడా తేజస్వరూపుడా
కణకణం క్షణక్షణం చైతన్యదీప్తుడా
!! స్వామీ !!
చిమ్మచీకట్లలో చిరుదివ్వెవైనావు
సమ్మెటతొ బరువైన సంకెళ్ళు త్రెంచావు
జ్ఞాన సుధలను పంచి జవ సత్వములునింపి
నలుదిశల నడయాడి భారతిని కొనియాడె
!! స్వామి !!
అస్పృశ్యతను తృంచి సమరసాలొలికించి
ప్రతి జీవిలోనున్న పరమాత్మ దర్శించి
దౌర్బల్య వైరివై వేదాంత భేరివై
వీర సన్యాసివై సత్యశొధన చేయు
!! స్వామీ !!
స్వాభిమానపు జ్యోతి యువతలో వెలిగించి
స్వాతంత్ర్య సమరాగ్ని కుండమున నిలిపావు
ఆధ్యాత్మ కిరణమై విజ్ఞాన చలనమై
ఆరాధ్య దైవమై అందరికి నేతవై
!! స్వామీ !!
సంకుచిత స్వార్థాల పంథాల నెదిరించి
విశ్వమత సభ లోన హుంకారమును చేసి
భారతీయుల ఆత్మ విశ్వాత్మగా కొలిచి
త్యాగ సేవా గుణము ప్రగతిపథమన్నావు
!! స్వామీ !!
రచన , గానం : శ్రీ అప్పాల ప్రసాద్
source: swadeshap.org
0 comments:
Post a Comment