728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Tuesday, 18 December 2012

అందగాడు మన వివేకానందుడు అందరివాడన్న - ఉడుకురక్తము ఉరికేటట్లు బోధ చేసెనన్న !!

Download
అందగాడు మన వివేకానందుడు అందరివాడన్న
ఉడుకురక్తము ఉరికేటట్లు బోధ చేసెనన్న !!

కులం పేరున భేదమొద్దని,నాన్నకు సుద్దులు సెప్పిండన్న
పేదల కష్టం చూసి ఇంటిలో వున్నది దానం ఇచ్చిండన్న
బళ్ళో చదువులు చదివినగాని ,తోటలొ ఆటలు ఆడినగాని
ఉన్నట్లుండి మౌనముద్రలో మునిగిన ఋషియన్న !!
!! అందగాడు మన !!
దేవుడు వుంటె చూపాలంటూ జాడ వెతుకుటకు వెళ్ళిండన్న
పరమహంసయే గురువుగ దొరికే, హృదయములో ఆనందం ఉబికే
భారతదేశం అటు ఇటు తిరిగి,భారతప్రజల బాధలు ఎరిగి
కన్యకుమారి కడలిని చేరి ,అంతరంగమున కలవరమొందె !!
!! అందగాడు మన !!
వెంట తరిమిన కోతుల చూసి ఎదురుతిరిగెను వినరన్నా
గొర్లమందలో కాటగలసి,ఇక సింహంలా లేసిండన్నా
బలమువుంటె బ్రతుకన్నడు, భయంతొటె చావన్నడు
గుండె ధైర్యము నిండుగ వుండి అమెరికాలొ అడుగేసిండన్న !!
!! అందగాడు మన !!
ఆకలిదప్పులు తోడున్నా, చెట్టు నీడలో పడుకున్నా
అందరమొకటని వివేకుడన్నా,అంటరానివాడన్నారన్నా
చదివిన శాస్త్రాల్ చెప్పుతుపోతె మేధావులనే మించిండన్నా
విశ్వమతంలొ పీఠంవేసి ఉపన్యాసమె దంచిండన్నా !!
!! అందగాడు మన !!
యూదులు,పార్శీలెందరొచ్చినా ఆశ్రయమిచ్చిన దేశం మనది
ప్రపంచ మతాలు ఎవర్ని కొలిసిన ,వినే దేవుడు ఒకటేనన్నా
బావిలొ కప్పగ బెకబెక మంటె బాధలు తప్పవు అన్నాడు
అందరిలో పుణ్యాత్ములచూసె గుణం పెంచుకోమన్నాడు !!
!! అందగాడు మన !!
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: అందగాడు మన వివేకానందుడు అందరివాడన్న - ఉడుకురక్తము ఉరికేటట్లు బోధ చేసెనన్న !! Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh