728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Saturday, 15 December 2012

యుగ యుగాల భరతమాత పుత్రులం - పవిత్రులం



!!పల్లవి!! 
యుగ యుగాల భరతమాత పుత్రులం పవిత్రులం - నరనరాన దేశభక్తి పొంగులెత్తు  శక్తులం (2)
ప్రళయ ఝంఝు మారుతం హైందవం మహాత్భుతం - జగతిలో మహోన్నతం ధర్మ జనుల భారతం 
అజేయ యోగ శక్తి రా........ (2) - అభేద్య భారత ధాత్రి రా  - శత్రు ముక చుట్టు ముట్టి మట్టు బెట్టు సైనిక  
!! యుగయుగాల !!
!! చరణం !!
గాండివం సుదర్శనం భవాని ఖడ్గ ధారులం - ఇనుప కండరాలు ఉక్కు నరాలున్న యువకులం (2)
స్వతంత్ర సమర హోమాగ్నిలో సమిధంలం యోగులం స్వర్ణ చరిత పుటలలో అఖండ కీర్తి ధాములం 
జ్ఞ్యాన శీల వంతులై ......... (2) హనుమ భీమ బంటులై ధర్మ రక్ష దీక్ష మనది ఆగకుండ సాగుదాం 
!! యుగయుగాల !!
హిందు సంద్ర హిమనగం గంగ సింధు సాగరం - ధీర గంభీర జలధి నిత్య స్పూర్తి దాయకం (2) 
గ్రీకు హున శక కుషానులనచినావు భూషిత - మొగలు ఆంగ్ల దొరల మెడలు వంచినావు ధీరుడ 
అడుగడున విజయమే ........ (2) అగదీప్రభంజనం దేశ ధర్మ రక్షణకై సాగుతోంది జనపథం  
!! యుగయుగాల !!
హిందు సైన్య తాండవం ప్రళయ కాల గర్జనం - ఫనవ భేరి శంఖ నాద తాల యోగ ఘోషణం (2) 
పదం పదం భుజం భుజం సంచలనం ధరాతలం - తివిక్రమం త్రిలోకముల్ కాంచె హిందు వైభవం 
మడమ త్రిప్ప వద్దురా .......(2)  పిడికిలి బిగియించరా దుస్ష్యసన దుర్మార్గుల తరిమి తరిమి కొట్టారా 
!! యుగయుగాల !!

  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: యుగ యుగాల భరతమాత పుత్రులం - పవిత్రులం Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh