728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Tuesday, 18 December 2012

అందరి కోసం అన్నీ ఇచ్చిన - దేశం కోసం పని చేద్దాం - సంకల్ప దివస్ గీథ్

Download
అందరి కోసం అన్నీ ఇచ్చిన - దేశం కోసం పని చేద్దాం (2)
దేశం మనకేమిచ్చిందంటూ వట్టి మాటలు కట్టేద్దాం 

సూర్యుడు వెలుగుల కిరణాలిస్తే - వాయువు ప్రాణం పోస్తుంది 
పొలాల పంటలతో భూమాతా ఆకలి తీరుస్తూ ఉంది
తోటి ప్రజలకూ తోడుందాం  - మానవత్వమూ సాదిద్దాం 
!! అందరి కోసం అన్నీ !!
దారిన పోయే జనులందరికీ చెట్లు నీడనే ఇస్తాయి 
వికసించే నవ పుష్పాలన్ని సువాసనలు అందిస్తాయి 
త్యాగ మూర్తులను స్మరియిద్దాం - ఆదర్శం గా జీవిద్దాం 
!! అందరి కోసం అన్నీ !!
వెనుకబడిన మన అన్నదమ్ములను  ప్రగతి పథమ్మున  నడిపించాలి 
మంచి మాటలే పలికించాలి - చదువుల సారం నేర్పించాలి 
శ్రమించి దీపం వెలిగిద్దాం - ఉజ్వల కాంతిని నింపేద్దాం  
 !! అందరి కోసం అన్నీ !!
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: అందరి కోసం అన్నీ ఇచ్చిన - దేశం కోసం పని చేద్దాం - సంకల్ప దివస్ గీథ్ Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh