728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Friday, 28 December 2012

" బెంగాలి మాతృక అయిన వందేమాతర" గీత తెలుగు అనువాదం - రచన , గానం : శ్రీ అప్పాల ప్రసాద్

Download


వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం
తల్లీ మా వందనం!
సుజలాం సుఫలాం మలయజ శీతలాం
సస్యశ్యామలాం వందేమాతరం
చల్లని వెన్నెల కాంతులలతో పరవశింపచేసి
తెల్లని పువ్వుల సుగంధాలతొ శోభనందచేసి
కిలకిల రవముల నవ్వులతో, చిరు చిరు జల్లుల ప్రేమలతో
సుఖాలనిచ్చే, వరాలనిచ్చే తల్లి వందనం                           
||వందేమాతరం || 

కోటి కోటి కంఠాలు పలికినవి - వందేమాతరం వందేమాతరం
కోటి కోటి ఖడ్గాలు లేచినవి - వందేమాతరం వందేమాతరం
ఎవరన్నరూ ఆబలవనీ
బహుబలధారిణీ నమామితారిణీ
రిపుదల వారిణీ మాతరం                                                 
||వందేమాతరం || 
విద్యవు నీవే ధర్మము నీవే
హృదయము నీవే సర్వము నీవే
ఈ దేహానికి ప్రాణము నీవే
బహుశక్తి మాకిమ్ము హృదయభక్తి గైకొమ్ము
తొమారయి ప్రతిమాగడి మందిరే మందిరే                          
||వందేమాతరం || 
పది భుజములతో శస్త్ర ధరించిన
ఆదిశక్తివి దుర్గవునీవే
పరిమళాలు వెదజల్లు కమలముల
వసియించెడి శ్రీలక్ష్మివి నీవె
చదువుల నిచ్చెడి వాణివి నీవె
నమామిత్వాం నమామికమలాం
అమలాం అతులాం సుజలాం సుఫలాం మాతరం               
||వందేమాతరం || 
శ్యామలమైన రూపము నీది సరళమైన అ కంఠమునీది
సుస్మితమైన వదనం నీది భూషితమైన దేహము నీది
ధరణీం భరణీం మాతరం                                                  
||వందేమాతరం || 
సౌజన్యం : http://www.swadeshap.org
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: " బెంగాలి మాతృక అయిన వందేమాతర" గీత తెలుగు అనువాదం - రచన , గానం : శ్రీ అప్పాల ప్రసాద్ Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh