728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Saturday, 8 October 2011

ఆపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్‌కు ఆధ్యాత్మిక స్ఫూర్తి "హిందుత్వం "

కంప్యూటింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి, వివిధ సంచలనాత్మక ఉత్పత్తులను ప్రపంచానికి అందించిన స్టీవ్ జాబ్స్‌కు ఆధ్యాత్మిక రంగానికి విశ్వగురవైన భారతదేశమే స్ఫూర్తినిచ్చింది. దారీతెన్నూ తెలియని యుక్తవయసులో ఆయన హిప్పీ సంస్కృతికి లోబడి 18వ ఏట పోర్ట్‌ల్యాండ్‌లోని ‘రీడ్’ అనే స్కూల్‌లో జాబ్స్ చదువు మానేసి తన స్నేహితుడు డాన్ కొట్టకేతో 1970వ సంవత్సరంలో భారతదేశంలోకి అడుగుపెట్టారు. చేతిలో ఉన్న డబ్బులు ఖర్చయితే మళ్లీ తిరుగు ప్రయాణానికి ఇబ్బందులని భావించిన జాబ్స్ ఒరెగావ్‌లోని హరే కృష్ణ ఆలయంలో ఉచిత భోజనం చేస్తుండేవాడు. ఖాళీ కోక్ బాటిల్స్ సేకరించి వాటిని అమ్ముతూ డబ్బులు సంపాదించేవాడు. ‘నాకు ప్రత్యేకమైన గదిలేదు. స్నేహితులతో పాటే నేలమీద పడుకునేవాడిని. కోక్ బాటిల్స్ సేకరించి అమ్మి ఆహార పదార్ధాలు కొనుక్కుని తినేవాణ్ని. ప్రతి ఆదివారం భోజనం కోసం ఏడుమైళ్లు వెళ్లి హరేకృష్ణ ఆలయానికి వెళ్లేవాణ్ని’ అని ఆయన చెప్పుకున్నారు.
భారత ఆచార వ్యవహారాలు, హిందూ మత పద్దతుల పట్ల ఆకర్షితుడై స్పూర్తి పొందాడు. బౌద్ద మతం తదితర అంశాలను అధ్యయనం చేసిన ఆయన తన వేషధారణను మార్చుకున్నాడు, గుండు చేయించుకుని అమెరికాకు తిరిగి వెళ్లేసమయంలో కాషాయ బట్టలతో వెళ్లారు. ఆయనకు హనుమాన్ భక్తుడైన నీమ్ కైరోలి బాబాతో పరిచయమైంది. బాబా జీవన విధానం జాబ్స్‌లో ఎంతో ఆధ్యాత్మిక భావాలను నింపింది. జాబ్స్, ఆయన స్నేహితుడి ఎదుటే బాబా మరణించడంతో ఆయన ఆశ్రమంలోనే జాబ్స్ చాలా కాలం ఉండిపోయాడు. భారతీయు ఆధ్యాత్మిక శైలి ఆయనకు నచ్చినా ఇక్కడ పేదరికం, ఆకలి బాధల ఇతర విషయాలు, జీవిత పరమార్ధాన్ని గ్రహించి ఏదైనా సాధించాలన్న ధ్యేయమే ఆయనను ‘యాపిల్’ కంపెనీ ఏర్పాటుకు స్ఫూర్తిదాయకమైంది.
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: ఆపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్‌కు ఆధ్యాత్మిక స్ఫూర్తి "హిందుత్వం " Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh