728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Sunday, 30 October 2011

దధీచి రక్త దాన యోజన - విజయవంతం - రాష్ట్ర వ్యాప్తంగా 50 కేంద్రాలలో 2500 మంది రక్తదానం

30-10-2011, భాగ్యనగర్ : హిందు హెల్ప్ లైన్ మరియు విశ్వ హిందు పరిషద్ ల సంయుక్త ఆధ్వర్యంలో దేశ వ్యాపితంగా హుతాత్మ దివస్ (అయోధ్య అమరవీరుల పై కాల్పులు జరిగిన దినం) ను పురస్కరించుకొని " దధీచి రక్త దాన యోజన"లో  భాగంగా సుమారు 1000 కేంద్రాలలో రక్తదాన శిభిరాలు నిర్వహించబడ్డాయి , దాదాపు ఒక లక్ష మంది రక్త దానం చేసారు .
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న శ్రీ విజయ సారధి ( జాగృతి సంపాదకులు )
 పశ్చిమాంధ్ర ప్రాంతంలో 50 కేంద్రాలలో రక్తదాన శిభిరాలు నిర్వహించబడ్డాయి అందులో దాదాపు 4000 మంది తమ రక్తాన్ని దానం చేసారు , గుంతకల్లు కేంద్రం లో స్థానిక శాసన సభ్యులు శ్రీ మధుసూదన గుప్త గారు పాల్గొని రక్తదానం చేసారు, ఈ కార్యక్రమంలో మార్గదర్శనం చేస్తూ ఇలాంటి పరమ - పవిత్ర కార్యక్రమంలో పాల్గొనటం తో మన జన్మలు పావనం అవుతాయన్నారు, ఈ కేంద్రంలో 100 మంది రక్తదానం చేసారు సుమారు 350 మంది పాల్గొన్నారు.
రక్తదాన దృశ్యాలు
 మొయినాబాద్ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో శ్రీ ఆకారపు కేశవరాజు ( ప్రాంత సంఘటన కార్యదర్శి ) పాల్గొని " అయోధ్య పోరాటాన్ని మరో స్వసంత్ర పోరాటంతో పోలుస్తూ , ఆ సమరంలో సమిధలైన వారి అడుగుజాడలో అయోధ్య భవ్య రామాలయ నిర్మాణం మన లక్షమని అన్నారు ఇక్కడ 78 మంది రక్త దానం చేసారు , గరిష్టంగా ఇందూరు ( నిజామాబాద్ ) జిల్లాలో  రెండు కేంద్రాలలో సుమారు 350 మంది రక్తదానం చేసారు   " నా దేశం - నా ధర్మం - నా రక్తం " నినాదంతో జరిగిన రక్త దాన  కార్యక్రమాలు హిందువులలో స్వాభిమాన జ్యోతులు వెలిగించాయి .
పెద్దల మార్గదర్శనం

విభాగ్ వారి స్థలాలు సంఖ్య వివరాలు

విభాగ్ పేరుస్థలాల సంఖ్యదాతల సంఖ్య
అనంతపురం విబాగ్ 7378
పాలమూరు విబాగ్ 7497
మెదక్ విబాగ్ 9465
ఇందూరు విబాగ్ 7395
కరినగరం విబాగ్ 2138
వరంగల్ విబాగ్ 261
భాగ్యలక్ష్మి విబాగ్ 10209
మహంకాళి విబాగ్ 6272

హిందూ హెల్ప్ లైన్ సంక్షిప్త పరిచయం :

హిందు హెల్ప్ లైన్ అనేది ఒక 24 X 7 హెల్ప్ లైన్ కేంద్రం దేశం లోని ఏ హిందువుకు ఆరోగ్య పరంగా , రవాణ , ప్రభుత్వ సంబంద , న్యాయ సంబంద , మత సంబంద , విషయాలో సహాయకారిగా ఉంటుంది , హిందు హెల్ప్ లైన్ - దేశంలోని ప్రతి హిందువుకు నమ్మదగిన , సహాయకారి అగు మిత్రునిలా ఉండాలని మాన్య శ్రీ ప్రవీణ్భాయి తొగాడియ గారు పేర్కొన్నారు , ఏవిధమైన సహాయమైన కేవలం ఒక్క ఫోన్ దూరంలో ఉంటుంది Phone No: 020-66803300 , 07588682181 మరిన్ని వివరాలకు http://hinduhelpline.com/  
Hindu Helpline Logo
 
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: దధీచి రక్త దాన యోజన - విజయవంతం - రాష్ట్ర వ్యాప్తంగా 50 కేంద్రాలలో 2500 మంది రక్తదానం Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh