728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Monday, 3 October 2011

ఉగ్రవాదంతో బంధం నిజం..శిక్షణ శిబిరాల నిర్వహణ యదార్ధం: పాక్ ఆర్మీ కమాండర్

ISI Logo
ఉగ్రవాద గ్రూపులు, ఐఎస్‌ఐ, పాక్ ఆర్మీ మధ్య సంబంధాలున్న విషయం ఇటీవల అరెస్టు చేసిన ఒక ఉగ్రవాది ఇంటరాగేషన్‌లో బయటపడింది. కాశ్మీర్ లోయ సరిహద్దు వద్ద మచీల్ సెక్టార్‌లో చొరబాటుకు ప్రయత్నించిన ఒక ఉగ్రవాది అరెస్టుతో ఈ వివరాలు వెల్లడయ్యాయని ఆర్మీ కమాండర్ ఒకరు తెలిపారు. ‘కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించేందుకు పాకిస్తాన్ యువకులకు శిక్షణ ఇవ్వడం, మానసికంగా వారిని సంసిద్ధుల్ని చేయడం, చొరబాట్లు జరపడం వంటి కార్యకలాపాలతో ఉగ్రవాద గ్రూపులకు, ఐఎస్‌ఐ, పాకిస్తాన్ సైనికులకు సంబంధాలున్నాయి. పాకిస్తాన్‌కు చెందిన ఎల్‌ఇటి ఉగ్రవాది నిస్సార్ అహ్మద్ అరెస్టుతో ఈ విషయాలు బయటపడ్డాయి’ అని చీనార్ కార్ప్స్ జివోసి లెఫ్ట్‌నెంట్ జనరల్ ఎస్‌ఎ హస్‌నైన్ విడుదల చేసిన రక్షణ సంబంధం ప్రకటనలో పేర్కొన్నారు. కరాచీకి చెందిన అలీ రెహమాన్ కుమారుడు నిస్సార్ అహ్మద్ శుక్రవారం మచీల్ సెక్టార్‌లో చొరబడి కాశ్మీర్‌లో ప్రవేశించేందుకు యత్నిస్తున్నప్పుడు పట్టుబడినట్లు జనరల్ హస్‌నైన్ చెప్పారు. ఈ పట్టుబడిన ఉగ్రవాది ప్రాథమిక దర్యాప్తులో తనను సైన్యం నియమించిందని మనే్షర ప్రాంతంలో ఎల్‌ఇటి శిబిరంలో శిక్షణ ఇచ్చారని వెల్లడించాడు.
పాకిస్తాన్ సైన్యం, ఐఎస్‌ఐ సంయుక్తంగా పాకిస్తాన్‌లోనూ, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తూ, ఉగ్రవాదాన్ని వ్యాపింపచేస్తూ కాశ్మీర్‌లో అస్థిరతను సృష్టించి, శాంతికి భంగం కలిగించడమే విధానంగా వ్యవహరిస్తోందని ఆయన తన ప్రకటనలో తెలిపారు. ‘పట్టుబడిన ఉగ్రవాది శిక్షణ పొందిన 12 మంది బృందంలో ఒకడు. వీరికి అన్నిరకాల ఆయుధాలు, పేలుడు పదార్ధాలను వినియోగించడం, ఏర్పాటు చేయడం, ఏ ప్రాంతాలకు ఎళా వెళ్లాలో, సమాచారం ఇచ్చి పుచ్చుకోడం, అందుకు అవసరమైన సామగ్రిని చేరవేయడం, సామగ్రిని సమకూర్చడం వంటి పనులలో శిక్షణ ఇస్తారు. ఇందుకు అవసరమైన సహాయ, సహకారాలు పాక్ ఆర్మీ, ఐఎస్‌ఐ సమకూరుస్తుంది. వీరికి శిక్షణ ఇచ్చే శిబిరం కమాండర్ అబ్దుల్లా షషీన్’ అని ఆయన ఆ ప్రకటనలో వివరించారు.
View Source
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: ఉగ్రవాదంతో బంధం నిజం..శిక్షణ శిబిరాల నిర్వహణ యదార్ధం: పాక్ ఆర్మీ కమాండర్ Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh