728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Saturday, 14 December 2013

సూర్యాపేట్ లో తిరిగి హిందుత్వంలోకి వచ్చిన 68 కుటుంబాల నుండి 221 మంది క్రైస్తవులు

సూర్యాపెట్ , నల్గొండ , 13/12/2013 : నల్గొండ జిల్లా సూర్యాపేట్ లోని అంబేద్కర్ నగర్ రామాలయం లో జరిగిన పునరాగమణ కార్యక్రమమం లో చుట్టు ప్రక్కల 7 గ్రామాలకు చెందిన 68 కుటుంబాల నుండి 221 మంది మతం మారిన హిందువులు తిరిగి హిందూదర్మం లోకి వచ్చారు, వారందరికీ శ్రీ రాముని చిత్ర పటాలు, నూతన వస్త్రాలు అందించబడ్డాయి. 

మాన్య శ్రీ గుమ్ముల సత్యం విశ్వ హిందూ పరిషద్ కేంద్రీయ సహా కార్యదర్శి గారు మాట్లాడుతూ ' జాతి ప్రధాన జీవన స్రవంతి నుండి ప్రలోభాలకు లోనై మతం మారినవారందరూ తిరిగి హిందుత్వంలోనికి రావడం శుభపరిణామం, హిందూ దర్మం చిర పురాతనం - నిత్య నూతనం అందుకే దీనిని సనాతన దర్మం అని అన్నారు , హిందుత్వంలో లేనిది ప్రపంచంలోని ఏ మతంలోనూ లేదు, అన్ని మతాలకు ధర్మాలకు జననిలాంటిది హిందుత్వం, నదులు ఎక్కడ పుట్టినా , ఎక్కడెక్కడ తిరిగినా అవి చివరికి ఆ సముద్రాన్నే చేరుతాయి అని ప్రభోదించిన హిందుత్వం ద్వారానే ప్రపంచ శాంతి సాధ్యమౌతుంది, తమ తల్లిని వీడిన మన సహోదరులందరినీ తిరిగి తమ మాతృ వోడిలోకిని తీసుకురావలసిన బాధ్యత మన అందరిది ' అని అన్నారు .

ఈ కార్యక్రమంలో శ్రీ పాల్శర్మ గారు , శ్రీ ఎల్లయ్య గారు , శ్రీ BS మూర్తి గారు గ్రామ పెద్దలు పాల్గొన్నారు 
Next
This is the most recent post.
Older Post
  • Blogger Comments
  • Facebook Comments

1 comments:

Item Reviewed: సూర్యాపేట్ లో తిరిగి హిందుత్వంలోకి వచ్చిన 68 కుటుంబాల నుండి 221 మంది క్రైస్తవులు Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh