728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Thursday, 5 December 2013

మిర్యాలగూడలో తిరిగి హిందుత్వంలోకి వచ్చిన 12 క్రైస్తవ కుటుంబాలు

మిర్యాలగూడ , ధర్మప్రసార్ , 28-Nov-2013 : మిర్యాలగూడ పట్టణం లోని శ్రీ సాయి దత్త ఆశ్రమం లో జరిగిన పునరాగమణ కార్యక్రమంలో చుట్టూప్రక్కల ఆరు గ్రామాలకు చెందిన 12 కుటుంబాల నుండి 48 మంది గత కొన్ని సంవత్సరాల క్రితం క్రైస్తవ మతాన్ని స్వీకరించారు , కాని వారి పూర్వికుల ధర్మానికి అన్యాయం జరుగుతుంటే , తాము అనేక తరాలుగా పూజిస్తున్న దేవుళ్ళను సైతాన్లు అని అంటుంటే భరించలేక తమ తప్పిదాన్ని తెలుసుకుని శ్రీ సాయి దత్త ఆశ్రమం లో కి  శ్రీశ్రీశ్రీ స్వామి సత్యాపాదానంద స్వామిజి మార్గదర్శనం లో తిరిగి తమ మాత్రు ధర్మమైన హిందుత్వాన్ని స్వీకరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య వక్త గా హాజరైన శ్రీ గుమ్ముల్ల సత్యం విశ్వ హిందు పరిషద్ కేంద్రీయ సహా కార్యదర్శి హిందూ ధర్మ వైభవాన్ని వివరించారు , అలాగే దారి తప్పిన మన సహోదరులను సక్రమ మార్గంలోకి పెట్టాల్సిన బాధ్యత మన అందరిది అని గుర్తుచేశారు . 



ఈ కార్యక్రమంలో BS మూర్తి గారు , బొడ్ల మాలికార్జున్ గుప్త గారు , శ్రీ ఉపేందర్ గారు , మొదలగువారు పాల్గొన్నారు , కార్యక్రమ అనంతరం స్వధర్మాన్ని స్వీకరించిన వారికి క్రొత్త బట్టలు , శ్రీ రాముని చిత్ర పటాలు పంపిణి చేయడం జరిగింది . 

source : www.vhpap.org
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: మిర్యాలగూడలో తిరిగి హిందుత్వంలోకి వచ్చిన 12 క్రైస్తవ కుటుంబాలు Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh