728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Tuesday, 14 May 2013

అమ్మ భారతి అందుకో మా హారతి


Download

అమ్మ భారతి అందుకో మా హారతి 
అందరమొకచోట నిలిచి పాడెదమీ కీర్తి గీతి !!

భయపడేది లేదెవరికి కాగడ చేబూనుదాం 
అంబరాన్ని అంటి,భూమి నలుచెరుగుల చేరుదాం
చీకట్లను పారద్రోలి ,దివ్యజ్యోతి నింపుదాం 
విజయం మనదేనంటూ జయకేతనమెత్తుదాం           !!1!!

విలువల భాంధవ్యాలను తెలిపే మన కుటుంబం 
అందరినీ ప్రేమించే ఆటపాటలానందం 
ఇల్లే గుడి, చదువులబడి, అమ్మ ఒడియే పావనఝరి 
కష్టసుఖం  కలగలిపి, కలసిమెలసి సాగుదాం       !!2!!

శక్తి సంభరితమైన శివసుందర పుత్రులం 
హృదయ సంజనితమైన దేశ భక్త పౌరులం 
మనమంతా భక్తి ,జ్ణాన ,కర్మయోగ కిరణాలం 
మనమంతా త్యాగసేవ  సద్గుణాల సేవకులం          !!3!!

వివేకుని సేవాపథ నివేదితల వారసులం
మానవతా పరిమళాలు వెదజళ్లే కుసుమాలం 
వసుంధరా శాంతి, ధర్మ  స్థాపనకై కదలుదాం 
భరత మాత గౌరవాన్ని జగతిలోన నిలుపుదాం    !!4!!


రచన , గానం : శ్రీ అప్పాల ప్రసాద్ గారు 


  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: అమ్మ భారతి అందుకో మా హారతి Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh