చరణాలకు ప్రణమిల్లి శరణువేడు తల్లిని
సంఘర్షణ సమయానికి శక్తి వరము నిమ్మని
ఉవ్వెత్తున ఎగసిపడే హిందు సింధు వీచికవై
మధ్యందిన మార్తాండుని స్వయంజ్వలిత జ్వాలవై
ఇంతింతై వటుడింతై దనుజ పీచ మణచినట్లు
అరిగణముల పరిమార్చగ వీరుడవై నీవు లేచి
సంఘర్షణ సమయానికి శక్తి వరము నిమ్మని
ఉవ్వెత్తున ఎగసిపడే హిందు సింధు వీచికవై
మధ్యందిన మార్తాండుని స్వయంజ్వలిత జ్వాలవై
ఇంతింతై వటుడింతై దనుజ పీచ మణచినట్లు
అరిగణముల పరిమార్చగ వీరుడవై నీవు లేచి
|| శరణువేడు తల్లిని ||
కృద్ధరామ ధనుర్ముక్త నిశిత శరాఘాతమువై
కాలకంఠు కంఠమందు మింటినంటు మంటవై
ప్రళయకాల నటిత కాళి పాదధూళి కళికవై
అరిశోణిత ఆజ్యమ్మును అమ్మకు అభిషేకమిచ్చి
|| శరణువేడు తల్లిని ||
దేశద్రోహ ముష్కరులను మట్టుబెట్ట నడుం కట్టి
కరసేవక రామదండు సంకల్పిత శక్తితో
అయోధ్య నేడు జాతి గతిని అవలీలగ మార్చగా
ధనుర్ధారి శ్రీరాముడు మనలనావహించగా
0 comments:
Post a Comment