728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Saturday, 10 December 2011

అన్నా హజారే ఒక్క రోజు నిరాహార దీక్షకు భారీగా మద్దతు తెలుపుతున్న జనం

దీక్షా స్థలి వద్ద అన్నా అభివాదం 
10/12/2011 కొత్త డిల్లి : సామాజిక కార్యకర్త , అవినీతి వ్యతిరేక ఉద్యమ నేత శ్రీ అన్నా హాజరే గారు బలమైన " జన లోకపాల్ " ను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టాలనే డిమాండ్ తో కొత్త డిల్లి లోని జంతర్ మంతర్ వద్ద తన ఒక్క రోజు నిరాహార దీక్షను ప్రారంభిచారు . ఈ సందర్భంగా " జన లోక్ పాల్ " బిల్లు మద్దతుదారులను ఉద్దేశించి అన్నా హజారే మాట్లాడుతూ " నేను నా దీక్షను ప్రారంభించాను కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడలేను కాని ఈ ప్రాంగనం "వందేమాతరం" , " భారత మాతా కి జై " నినాదాలతో దద్దరిల్లా"లని అన్నారు .

ఈ దీక్షలో శ్రీ అన్నా హజారే తో పాటుగా వారి బృంద సభ్యులైన శ్రీ అరవింద్ కేజ్రివాల్ , మనిష్ సిసోదియ , సంజయ్ సింగ్ మరియు కుమార్ విశ్వాస్ లు కూడా పాల్గొంటున్నారు . "ఆయన భారత దేశ వాణి - నిజమైన భారత స్పూర్తి ప్రదాత " అని  అన్నా బృంద సభ్యురాలు కిరణ్ బేడి ఈ సందర్భంగా  పేర్కొన్నారు .  

వేల మంది జాతీయ వాదులైన తన మద్దతు దారుల "వందేమాతరం" , భారత్ మాతా కి జై " నినాదాలతో జంతర్ మంతర్ ప్రాంగణం ప్రతిధ్వనిస్తున్న వేళ  సుమారు 10:15 గంటలకు శ్రీ అన్నా హజారే గారు తన దీక్షను ప్రారంభించారు.

దీక్ష ప్రారంభానికి ముందు అన్నా బృందం రాజఘాట్ వద్ద మహాత్మా గాంధి సమాధికి నివాళి ఘటించి దీక్ష స్థలికి చేరుకున్నారు. కాగా నేడు (ఆదివారం) ప్రభుత్వ లోక్ పాల్ బిల్లు పార్లమెంట్లో చర్చకు రావడం ఇక్కడ గమనార్హం .
జాతీయ వాద  దృక్పదంతో , " జన లోక్ పాల్ " బిల్లు కోసం  ఈ సంవత్సర కాలంలో  అన్నా చేస్తున్నా మూడో దీక్ష ఇది .
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: అన్నా హజారే ఒక్క రోజు నిరాహార దీక్షకు భారీగా మద్దతు తెలుపుతున్న జనం Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh