728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Saturday, 22 December 2012

తెలుసుకో ధీర సన్యాసీ, - ఎలుగెత్తి పాడరా ఓం తత్ సత్ ఓం !


Download
తెలుసుకో ధీర సన్యాసీ,
ఎలుగెత్తి పాడరా ఓం తత్ సత్ ఓం !!

స్వాతంత్ర్య వీరుడవు జ్ఞాన సంపన్నుడవు
సకల జగతికి సాక్షిభూతుడవు నీవెరా
ఆకారమే లెదు నామరహితుడవు నీవు
ఆత్మయై అన్నింట వెలుగొంది లేవరా !!

మంచి చేసిన మంచి , చెడ్డ చేసిన చెడ్డ
ఏ విత్తనము వేస్తె ఆ పంటయే వచ్చు
నీవు చేసిన కర్మ అనుభవించాలిరా
కర్మఫలమంటనిది ఆత్మయే నిజమురా !!

కొరివి దయ్యము చూసి కాంతి అనబోకురా
కటిక చీకటి చీల్చి కదనమెత్తర నీవు
జనన మరణము తెలిసి బ్రతుకుపై తీపేల
ఆత్మ గెలిచిన ఇంక అడ్డునీకేముంది !!

వాసనలు దరిరాని కారడవులందున
కోరికలు దగ్ధమౌ కొండ గుట్టలయందు
అజ్ఞానమే లేని తీర్థరాజములలో
అంతటా శాంతి సందేశం , ఆత్మయే నిత్య సంతోషం !!

తలిదండ్రులెవ్వరు? కొడుకు స్నేహితులెవరు?
ఎవరి చుట్టం వీడు? ఎవరు శత్రువురా?
కలల లోకమ్ములో విహరించ బోకురా
నిర్గుణమ్మైన ఈ ఆత్మయే నిజమురా !!

బంగారు గొలుసులే బానిసపు సంకెళ్ళు
రాగద్వేషాలు నిను బంధించి వేసెరా
సంకెళ్ళు త్రెంచుకొని విదిలించి లేవరా
సత్య స్వేచ్చా గీతమాలపించగ రార !!

రచన , గానం : శ్రీ అప్పాల ప్రసాద్ 
source: swadeshap.org  
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: తెలుసుకో ధీర సన్యాసీ, - ఎలుగెత్తి పాడరా ఓం తత్ సత్ ఓం ! Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh