728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Wednesday, 10 August 2011

నమో నమో ప్రియ భరతమాత నమో నమో జయ మంగళ గీత - Vijaya Vipanchi



నమో నమో ప్రియ భరతమాత నమో నమో జయ మంగళ గీత
అమోఘ చరితవు ప్రమోద భరితవు జగద్గురువువే చల్లని తల్లి || నమో నమో ||


శీత గిరీంద్రమే శ్వేత చ్చత్రమై సింహళమే నీ పాదపీటమై
ప్రీతిగా నూరు కోట్ల ప్రజలతో వీరాజిల్లు మా వరాల తల్లి || నమో నమో ||


గంగా యుమనా కృష్ణ గోదావరి బ్రహ్మపుత్ర కావేరి పినాకిని
పొంగి పొరలే ఆ తరంగాలతో అలరారేడి మా బంగారు తల్లి || నమో నమో ||


వేదవ్యాసుడు ఆది శంకరులు రామకృష్ణ వివేకానందులు
త్యాగశీలురా ధీర వీరులా కని పెంచిన మా కాంచన వల్లి || నమో నమో ||

  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: నమో నమో ప్రియ భరతమాత నమో నమో జయ మంగళ గీత - Vijaya Vipanchi Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh