728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Monday, 1 August 2011

రక్షాబంధన సూత్రమిదే - హిందూ జీవన మంత్రమిదే - Vijaya Vipanchi



రక్షాబంధన సూత్రమిదే - హిందూ జీవన మంత్రమిదే
ఈ జగమంతా ఈశ్వర నిలయం - ఏకాత్మతయే సృష్టి రహస్యం ||రక్షా బంధన||


కార్మికులైనా కర్షకులైనా - పదవీ గౌరవ భాజనులైనా
భారతమాతా సంతానం - హిందువులంతా ఏక కుటుంబం ||రక్షా బంధన||


స్వార్థం, మోసం, పరమత ద్వేషం - హింసా, క్రౌర్య దానవ శక్తులు
పరోపకారం సమాన భావం - త్యాగం సేవా దైవీ శక్తులు ||రక్షా బంధన||


భోగవాదమును, భావ దాస్యమును - పరపీడనమును పారగ ద్రోలుము
సకల సంపదలు జగదీశునివే - అర్థ కామముల మూలము ధర్మము ||రక్షా బంధన||


దధీచి మహర్షి త్యాగ సంపద - రామకృష్ణుల దివ్య తపస్సు
గౌతమ శంకర కరుణాద్వైతం - వివేకవాణి విశ్వజనీనత ||రక్షా బంధన||

  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: రక్షాబంధన సూత్రమిదే - హిందూ జీవన మంత్రమిదే - Vijaya Vipanchi Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh